“శివ, సత్య, కంపెనీ” వంటి చిత్రాలతో తెలుగు, హిందీ సినిమాల గమనాన్ని మార్చి.. ఏకంగా ఇండస్ట్రీలను శాసించిన ఘనత ఒక్క రాంగోపాల్ వర్మకే సొంతం. అటువంటి వర్మ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు తీస్తున్నాడు అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఇప్పటివరకూ ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచిన వర్మ ఇప్పుడు మరో వ్యక్తి నుంచి ఇన్స్పిరేషన్ పోందుతూ కాలాన్ని వెళ్లదీస్తున్నాడు. వర్మ ప్రస్తుతం ఫాలో అవుతున్న వ్యక్తి మరెవరో కాదు బాలీవుడ్ ను తన సీరియల్స్ తో శాసించిన ఏక్తా కపూర్ ను.
ఆమె తీసే సిరీస్ లు చీప్ వి కావచ్చు కానీ.. ఆమె వ్యక్తిత్వం తెలిసినవారెవరైనా ఆమెకు సలాం చేయాల్సిందే. ఈ యాప్ బిజినెస్ ను ముందే ఊహించిన ఏక్తా కపూర్ హాot & స్టీమీ కంటెంట్ ను ఎప్పట్నుంచో తన ఆల్ట్ బాలాజీ యాప్ లో చేర్చుకుంటూ వచ్చింది. విచ్చలవిడి srunగార సన్నివేశాలు, యువతను రెచ్చగొట్టే అందాల భామలు, వారి అందాల ఆరబోతలు, ముద్దులు, మురిపాలతో సదరు యాప్ ను ఎప్పుడో నింపేసింది.
ఇప్పుడు వర్మ కూడా శ్రేయాస్ ఈటీ అనే యాప్ తో టైఅప్ అయ్యి అదే ఫార్మాట్ ను ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం డిజిటల్ మార్కెట్ లో దూసుకుపోతున్న కంటెంట్ srunగార. ఎంత రసవత్తరంగా, రక్తి కట్టేలా తీయగలిగితే అంతలా జనాలు చూస్తున్నారు. అందుకే వర్మ ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్స్ ను, అన్నిటికీ బరితెగించేసిన భామలను తీసుకొచ్చి ఏవేవో పేర్లతో చిత్రవిచిత్రమైన సిరీస్ ను తీసేస్తున్నాడు. మరి వర్మ యాప్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
Most Recommended Video
ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!