జనాలను ఆకర్షించడంలో రాంగోపాల్ వర్మని మించిన వాళ్ళు లేరు. టెక్నాలజీని, సోషల్ మీడియాని వాడుకోవడంలో అయితే వర్మ పి.హెచ్.డి చేసేశారనే చెప్పొచ్చు. లాక్ డౌన్ మొదలైనప్పుడే ఓటిటిల హవా ఊపందుకోలేదు. వర్మ తీసిన ఓటిటి సినిమాలు మరియు వాటిని ఆయన మార్కెట్ చేసిన విధానాన్ని బట్టి.. ఓటిటిల జోరు ఊపందుకుంది. ఎంతో మందికి ఓటిటిని ఎలా ఉపయోగించుకోవచ్చో వర్మ ఓ లెసన్ చెప్పారని చెప్పొచ్చు. అయితే అడల్ట్ కంటెంట్ సినిమాలు లేదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టే వివాదాస్పద సినిమాలు చేసి ఆయన ఎక్కువగా వార్తల్లో నిలిచారు.
ఇప్పుడు ఆ ట్రెండ్ కు కూడా వర్మ ఫుల్ స్టాప్ పెట్టేసి కొత్త ట్రెండ్ ను మొదలుపెట్టారు. అదేంటో ఈపాటికే మీకు తెలిసుండొచ్చు. బుల్లితెర యాంకర్లను విభిన్న పద్దతిలో ఇంటర్వ్యూలు చేయడం. ఇక్కడ విభిన్న పద్ధతి అంటే వర్మ స్టైల్ గురించి.. ఆయన నైజం గురించి తెలిసిన వాళ్లకి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వీటిని అడల్ట్ లేదా బోల్డ్ ఇంటర్వ్యూలు అని చెప్పాల్సి వస్తోంది. మొన్నటికి మొన్న అరియనా గ్లోరీని..
వర్మ ఇంటర్వ్యూ చేసిన తీరు ఎంత హాట్ గా ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానిని మించేలా ఇటీవల అషూరెడ్డి ని ఇంటర్వ్యూ చేశారు వర్మ. ఈ ఇద్దరు భామలు బిగ్ బాస్ కంటెస్టెంట్ లే కావడం మరో విశేషం.ఈ జర్నీ ఇక్కడితో అయిపోలేదు భవిష్యత్తులో మరిన్ని బోల్డ్ ఇంటర్వ్యూలతో రానున్నారట వర్మ.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!