అసలు నిజం చెబితే వాళ్లకు గుండె ఆగిపోద్ది : వర్మ

  • July 27, 2020 / 09:00 PM IST

రాంగోపాల్ వర్మ ఇటీవల ‘పవర్ స్టార్’ సినిమాతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ జీవితం ఎన్నికల తరువాత.. అన్నట్టు ఈ సినిమాని తెరకెక్కించాడు వర్మ. ఈ సినిమా ట్రైలర్ 4 నిముషాలు ఉంది.. సినిమా 37 నిముషాలు ఉంది. చివర్లో రాంగోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చి అక్కడే ఓ 8 నిమిషాల వరకూ తినేసాడు. మొదటి నుండీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను కెలికి.. చివర్లో ఓ బిస్కెట్ వేసి కూల్ చేసేసాడు వర్మ. సరే ఇక్కడితో అయిపోయింది కదా అనుకుంటే.. ‘అప్పుడే అయిపోలేదు..

ఇప్పుడే మొదలైంది’ అంటూ గబ్బర్ సింగ్’ సినిమా స్టైల్ లో చెబుతున్నాడు రాంగోపాల్ వర్మ. ‘పవర్ స్టార్’ సినిమా ఇక్కడితో అయిపోలేదట. దీనికి కొనసాగింపుగా మారో రెండు, మూడు సిరీస్ లు తీస్తాను అంటున్నాడు వర్మ.’ ‘పవర్ స్టార్’ చిత్రాన్ని బ్యాన్ చేస్తాం’ అని చెప్పిన వాళ్లకు.. ఆ సినిమాకి అయిన బుకింగ్స్ ఎన్నో చెబితే వాళ్ళ గుండె ఆగిపోద్ది. కాబట్టి వాళ్ళ క్షేమం కోసం నేను ఆ లెక్కను చెప్పదలుచుకోలేదు.

ఇక నేను ఆన్లైన్ లో సినిమాలు తెరకెక్కిస్తున్నందుకు నన్ను ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుంది అని అంతా అనుకుంటున్నారు. కానీ వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే.. నాకు ఫిలిం ఇండస్ట్రీతో సంబంధం లేదు. నాకు తెలిసింది ‘ఆర్జీవి’ ఇండస్ట్రీ మాత్రమే’ అంటూ చమత్కారంగా చెప్పుకొచ్చాడు రాంగోపాల్ వర్మ.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus