RGV,Chiranjeevi: చిరంజీవి గురించి నేనేం మాట్లాడిన అభిమానిగానే మాట్లాడాను: వర్మ

  • December 7, 2022 / 06:07 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా గుర్తింపు పొందిన రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాలకు కారణమవుతున్నారు. ఈయన సోషల్ మీడియా వేదికగా ఏం మాట్లాడినా ఆ విషయం పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతూ ఉంటుంది.ఇలా సోషల్ మీడియా వేదికగా అయినా లేదా ఇంటర్వ్యూలలో అయినా రామ్ గోపాల్ వర్మ చేసే కామెంట్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన డేంజరస్ సినిమా ఈనెల తొమ్మిదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా రాంగోపాల్ వర్మ మెగాస్టార్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ నేను చిరంజీవి గారి గురించి ఎప్పుడు మాట్లాడిన ఆయన గురించి ఏ పోస్ట్ చేసిన ఒక దర్శకుడిగా కాకుండా ఒక అభిమానిగా మాత్రమే చిరంజీవి గురించి పోస్టులు పెట్టే వాడినని తెలిపారు.

ఇక చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమా సమయంలో చిరంజీవి గురించి వర్మ చేసిన కామెంట్స్ పై ఈ సందర్భంగా స్పందించారు. తాను చిరంజీవి ఫ్యామిలీ గురించి ఎప్పుడు సెటైర్స్ వేయలేదు ఇక ఖైదీ నెంబర్ 150 సినిమా సమయంలో కూడా ఒక అభిమానిగా చిరంజీవి లాంటి స్టార్ హీరో ఇలాంటి చిన్న సినిమాలలో నటించడం ఏంటి బాహుబలి లాంటి సినిమాలలో నటిస్తే బాగుండు అన్నాను.

ఇందులో తాను సెటైర్ వేసినట్టు ఎక్కడ కనిపించలేదని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గురించి రాంగోపాల్ వర్మ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus