పవన్ ని మానసికంగా వేధిస్తున్న వర్మ

  • July 9, 2020 / 12:50 PM IST

ఈ మధ్యనే రామ్ గోపాల్ వర్మ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. పవన్ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ అని…భవిష్యత్ లో సీఎం అవడం ఖాయం అని చెప్పుకొచ్చారు. పవన్ పై సందు దొరికినప్పుడల్లా…సెటైర్ లు వేసే వర్మ, ఈ విధంగా ప్రశంసించడం అందరికీ ఆశ్చర్యం వేసింది. ఆయన అప్పటి మాటల వెనుక ఆంతర్యం, వ్యంగ్యం ఏమిటో తెలుసుకోవడానికి పవన్ ఫ్యాన్స్ కి కొంచెం సమయం పట్టింది.

పవర్ స్టార్ అనే మూవీని తెరకెక్కిస్తున్నాను అని ప్రకటించిన వర్మ, పవన్ ని పోలిన ఓ వ్యక్తి తన ఆఫీస్ కి వచ్చి వెళుతున్న వీడియో పంచుకున్నారు. ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో అత్తారింటికి దారేది మూవీ బీజీఎమ్ ప్లే చేశాడు. దీనితో పవన్ ని గెలికే కార్యక్రమం వర్మ పెట్టుకున్నాడని అర్థం అయ్యింది. ఇక నేడు పవర్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి టైటిల్ లోగోలో జనసేన పార్టీ సింబల్ అయిన గాజు గ్లాసు పెట్టారు.

దానితో పాటు పోస్టర్ పై ఎన్నికల తరువాత కథ అని చెప్పి, వర్మ పవన్ ని ఏ యాంగిల్ లో టార్గెట్ చేయనున్నాడో హింట్ ఇచ్చాడు. ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన సంఘటనను ప్రజలకు మరియు ఆయన ఫ్యాన్స్ కి గుర్తు చేసి వర్మ వారిని ఇబ్బంది పెట్టడానికి సిద్ధం అయ్యాడని అర్థం అవుతుంది. ఇక ఈ మూవీలో చిరంజీవి పాత్ర కూడా ఉంటుందని, ఓ వర్కింగ్ స్టిల్ విడుదల చేసి తెలియజేశాడు. గతంలో కూడా అమ్మరాజ్యంలో కడపబిడ్డలు మూవీలో పవన్ ని ఆయన పార్టీని అబాసుపాలు చేసిన వర్మ మరో మారు పవన్ ఫ్యాన్స్ మనోభావాలతో ఆడుకోవడానికి సిద్ధం అయ్యారు.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus