Rambha: రోడ్డు ప్రమాదానికి గురైన రంభ కారు.. హాస్పిటల్ పిక్ షేర్ చేస్తూ…!

  • November 2, 2022 / 12:47 PM IST

సీనియర్ స్టార్ హీరోయిన్ రంభ మరియు ఆమె కుటుంబానికి పెద్ద ప్రమాదం తప్పింది. వాళ్ళు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. కానీ రంభకు కానీ ఆమె కుటుంబ సభ్యులకు గాను అదృష్టవశాత్తు ఏమీ కాలేదు. కారులో రంభతో పాటు ఆమె పిల్లలు అలాగే వారి ఆలనా పాలనా చూసుకునే ఆయా ఉన్నట్టు సమాచారం. ఈ విషయం పై రంభ స్పందిస్తూ.. ” పిల్లలను స్కూల్ నుండీ తీసుకువస్తుండగా మా కార్ ఇంటర్సెక్షన్ వద్ద మరో కారుని ఢీ కొట్టింది. ఆ సమయంలో నేను పిల్లలు అలాగే ఆయా కారులో ఉన్నాం. చిన్న చిన్న గాయాలతో మేము బయట పడ్డాం.

చిన్నారి నాషా మాత్రం హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. మా గురించి ప్రార్థించండి. మాకు బ్యాడ్ టైం నడుస్తుంది. ఇప్పుడు మీ ప్రార్థనలు మాకు చాలా అవసరం ” అంటూ విన్నపించుకుంది రంభ. హాస్పిటల్ లో చిన్నారి ఉన్న ఫోటోని కూడా రంభ షేర్ చేసింది. వాళ్ళది ఎస్ యు వి కార్ కావడంతో సకాలంలో ఎయిర్ బాగ్స్ తెరుచుకున్నాయి అని తెలుస్తుంది. కార్ డోర్ భాగం కూడా డామేజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రంభ .. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుండగా ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది. మరోపక్క ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి ఆమె ఓకె చెప్పినట్టు వినికిడి. పాపులర్ ఓటీటీ సంస్థ ఈ సీరీస్ ను నిర్మించనుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus