Naresh, Ramya: నరేష్ అలా చేయడం సరికాదన్న రమ్య రఘుపతి!

Advertisement

నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారనే సంగతి తెలిసిందే. తాజాగా రమ్య రఘుపతి పవిత్ర లోకేశ్ పై చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించడంతో ఆమె గురించి జోరుగా చర్చ జరుగుతోంది. తాజాగా రమ్య రఘుపతి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నరేష్ తో తాను ఇంకా విడాకులు తీసుకోలేదని ఆమె తెలిపారు. పవిత్ర లోకేశ్ తన భర్తతో కలిసి ఎందుకు తిరుగుతోందని ఆమె ప్రశ్నించారు.

నరేష్ కు నేను విడాకులు ఇవ్వనని నేను అందరి ముందు పెళ్లి చేసుకున్నానని ఆమె తెలిపారు. మరో మహిళతో నా భర్త తిరగడం కరెక్ట్ కాదని ఆమె చెప్పుకొచ్చారు. వారికి పోలీసులు అండగా ఉండటం ఏమిటని ఆమె ప్రశ్నించారు. నరేష్, పవిత్ర లోకేశ్ ఏ విధంగా కలిసి ఉంటారో నేను చూస్తానని ఆమె కామెంట్లు చేశారు. మైసూర్ లోని హోటల్ గదిలో పవిత్ర, నరేష్ ఒకే గదిలో ఉండగా రమ్య రఘుపతి పట్టుకున్నారు.

రమ్య గట్టిగా అరుస్తూ నరేష్, పవిత్రలపై దాడి చేయడానికి ప్రయత్నించడం గమనార్హం. నెటిజన్లలో కొందరు రమ్య రఘుపతికి సపోర్ట్ చేస్తుంటే మరి కొందరు ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండటం గమనార్హం. రమ్య రఘుపతి నరేష్ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఈ వివాదం మరింత పెద్దదైతే అటు నరేష్ ఇటు పవిత్ర లోకేశ్ సినీ కెరీర్ పై కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

నరేష్ పవిత్ర లోకేశ్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో అనవసర వివాదాలు ఇద్దరి కెరీర్ కు మంచిది కాదు. నరేష్ పవిత్ర లోకేశ్ రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉందని సమాచారం అందుతోంది. నరేష్ పవిత్ర లోకేశ్ లకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉందనే సంగతి తెలిసిందే.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!</strong

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus