రానాకి కాబోయే భార్య టాటూ మీనింగ్ ఏంటంటే?

అసలు నాకు పెళ్ళి, సంసారం బాధ్యతల గురించి అస్సలు ఏమీ తెలీదు… అని గతంలో కామెంట్స్ చేసిన రానా పెళ్ళి చేసుంటాడు అని ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా మిహీక బజాజ్ అనే ఈవెంట్ మ్యానేజర్ తో ప్రేమలో ఉన్నట్టు తెలిపి.. ఆమె పెళ్ళికి ఓకే చెప్పిందని తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. దీంతో ఈ ఏడాదే రానాకు పెళ్ళి చేయబోతున్నట్టు.. రానా తండ్రి అలాగే స్టార్ ప్రొడ్యూసర్ అయిన సురేష్ బాబు కూడా క్లారిటీ ఇచ్చేసారు. అయితే నిన్న(బుధవారం) నాడు సీక్రెట్ గా రానా ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది..

లాక్ డౌన్ కారణంగా కొద్దిమంది సమక్షంలో ఈ పెళ్ళివేడుక జరుగబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ వీటిని సురేష్ బాబు ఖండించారు. మిహీక ఫ్యామిలీని కలుస్తున్న మాట నిజమే కానీ.. ఎంగేజ్మెంట్ గురించి కాదు. ఎంగేజ్మెంట్ మరియు పెళ్ళి గురించి ముహుర్తాలు ఫిక్స్ చేసుకోవడానికి మాత్రమే. ఎంగేజ్మెంట్ మరియు పెళ్ళికి సంబంధించిన విషయాలు త్వరలో తెలియచేస్తాం అని సురేష్ బాబు తెలిపారు. ఇదిలా ఉండగా.. రానా తన ఫియాన్సీ మిహీక గురించి అనౌన్స్ చెయ్యగానే.. ఈమె బాగా పాపులర్ అయ్యింది.

ఇప్పుడు ఈమె టాటూ ఫోటోని పోస్ట్ చేసి ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. విషయం ఏమిటంటే.. మిహీక చేతిపై రానా లోని మొదటి అక్షరం ‘R’ మరియు మిహీక లోని మొదటి అక్షరం ‘M’ మధ్యలో లవ్ సింబల్ తో ఓ టాటూ వేయించుకుంది. దీంతో రానా పై ఈమెకు ఎంత ప్రేమ ఉందనేది సింబాలిక్ గా తెలిపినట్టు అర్థంచేసుకోవచ్చు.


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus