ఆర్భాటాలకు దూరంగా మిహికా తో రానా ఎంగేజ్మెంట్!

  • May 21, 2020 / 05:54 PM IST

కొద్దిరోజుల క్రితం తన ప్రేయసిని ప్రపంచానికి పరిచయం చేసిన రానా దగ్గుబాటి, అధికారికంగా ఆమెనే తన భార్య అంటూ నిర్ధారించారు. సోషల్ మీడియాలో వీరి ఎంగేజ్మెంట్ కి సంబందించిన ఫోటోలు పంచుకొని రానా ఫ్యాన్స్ మరియు సన్నిహితులకు అసలు విషయం తెలియజేశారు. హైదరాబాద్ కి చెందిన మిహికా బజాజ్ తో రానా ప్రేమలో ఉన్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. నగలవ్యాపారి కుమార్తె అయిన మిహికా సొంతగా కొన్ని వ్యాపారాలు నడుపుతుంది.

కామన్ ఫ్రెండ్స్ ద్వారా రానాకు పరిచయమైన మిహిక కొంత కాలానికి ప్రేయసిగా మారిపోయింది. ఇక నిన్న వీరిద్దరికి కుటుంబ సభ్యులు నిశితార్థం కూడా జరిపి వేశారు. లాక్ డౌన్ నిబంధనల వలన కేవలం కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తుంది. ఇక వీరి పెళ్లి ఈ ఏడాది చివర్లో ఉంటుందని సమాచారం. డిసెంబర్ నెలలో వీరి వివాహం ఉంటుందని గట్టిగా వినిపిస్తుంది.

రానా తండ్రి సురేష్ బాబు కూడా ఇదే విషయం చెప్పారు. ఇక ప్రస్తుతం రానా తెలుగులో విరాటపర్వం అనే మూవీలో నటిస్తున్నారు. అలాగే ఆయన తమిళ, హిందీలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. డిసెంబర్ నాటికి అవి పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వీరి పెళ్లి భారీ ఎత్తున డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట.

1

2

3

4

5

6

 

 


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus