Rana Daggubati: ఆ నటి స్థలం విషయంలో కోర్టు మెట్లెక్కిన రానా!

  • July 13, 2022 / 01:27 PM IST

తాజాగా ద‌గ్గుబాటి రానా కోర్టు మెట్లెక్కడం చర్చనీయాంశం అయ్యింది. మంగ‌ళ‌వారం నాడు హైద‌రాబాద్ సిటీ సివిల్ కోర్టు విచార‌ణ‌కు అతను హాజ‌రైనట్టు తెలుస్తుంది.వివరాల్లోకి వెళితే.. ఒకప్పటి నటి మాధవి లత కి ఫిలింనగర్ లో ఉన్న 2,200 చదరపు గజాల స్థలాన్ని, దగ్గుబాటి సోదరులు అయిన సురేష్‌ బాబు, వెంకటేష్ లు కొనుగోలు చేశారు. 2014లో ఆ స్థలాన్ని ఒక వ్యాపారికి వారు లీజుకి ఇవ్వడం జరిగింది. 2014వ సంవత్సరంలో జరిగిన అగ్రిమెంట్ తర్వాత 2016 లో, 2018 లో కూడా లీజు అగ్రిమెంట్ రెన్యువల్ చేయించుకున్నాడు ఆ వ్యక్తి.

లీజు అగ్రిమెంట్ కొనసాగుతూ ఉండగానే.. ఆ 2200 చదరపు గజాల స్థలంలో 1000 గజాల స్థలాన్ని సురేష్ బాబు తన పెద్ద కొడుకు రానా పేరు పై రిజిస్ట్రేషన్ చేయించారట. రానా రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే అందులో ఉన్న లీజు దారుడిని ఆ స్థలం ఖాళీ చేయాలని ఒత్తిడి చేసారని… ఆ ఒత్తిడి తట్టుకోలేక అతను ఆ స్థలాన్ని ఖాళీ చేసినట్లు కోర్టు మెట్లు ఎక్కాడు. లీజు అగ్రిమెంట్ ఉండగానే తన స్థలం ఖాళీ చేయమని ఒత్తిడి చేయడంతో, ఆర్ధికంగా కూడా చాలా నష్టపోయాను అని సిటీ సివిల్ కోర్టులో అతను ఒక పిటిషన్ దాఖలు చేశాడు.

ఈ నేపథ్యంలోనే రానాకు కోర్టు నోటీసులు అందడంతో ఆయన కోర్టుకు హాజరయ్యారు.ఇక ఈ విషయం పై న్యాయస్థానం మరింత విచారణ ముమ్మరం చేయాలని ఆదేశిస్తూ ఈ కేసుని జూలై 14వ తేదీకి వాయిదా వేసింది. ఇక రానా సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది భీమ్లా నాయక్, విరాటపర్వం వంటి చిత్రాల్లో నటిస్తూనే ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus