Rana,Miheeka: ఒక్క రిప్లై తో క్లారిటీ ఇచ్చేసిన మిహీకా బజాజ్

Advertisement

దగ్గుబాటి రానా 2020 లాక్‌డౌన్ టైంలో మిహికా బజాజ్ ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మెన్ అయ్యాడు.ఇదిలా ఉండగా.. ఇటీవల రానా కొద్దిరోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని.. తమ పిక్స్ అన్నిటినీ డిలీట్ చేశాడు. దీంతో, రానా- మిహికా .. ‘విడాకులు తీసుకోబోతున్నట్లు కథనాలు పుట్టుకొచ్చాయి. వెంటనే.. రానాతో కలిసున్న ఓ పిక్ ను పోస్ట్ చేసి ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది మిహిక.

ఇప్పుడు ఈ జంట గురించి మరో వార్త హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే రానా తండ్రి కాబోతున్నాడు అనేది ఆ వార్త సారాంశం. గత 3 రోజులుగా ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. దగ్గుబాటి ఫ్యామిలీ ఈ విషయాన్ని త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యనుందని కూడా కామెంట్స్ వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చింది మిహీకా. తాను ప్రెగ్నెంట్ అని వస్తున్న వస్తున్న వార్తల్లో నిజం లేని ఈ దగ్గుబాటి వారి కోడలు క్లారిటీ ఇచ్చింది.

‘ మీరు ప్రెగ్నెంటా?’ అంటూ సోషల్ మీడియాలో ఓ నెటిజన్ మిహీకాను ప్రశ్నించగా, అందుకామె ‘నేను హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాను అని… అందుకే ఈ మధ్య మరింత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది.దీంతో ప్రెగ్నెన్సీ వార్తలకు మిహీకా ఫుల్ స్టాప్ పెట్టినట్టే అని చెప్పాలి.

2020 వ సంవత్సరం ఆగస్ట్ 8న రానా- మిహీకా ల పెళ్లి జరిగింది. మిహీకా.. వెంకటేష్ కూతురు అశ్రితకి మంచి ఫ్రెండ్. ముందు నుండి ఉన్న పరిచయం కారణంగానే రానా ఆమెకు ప్రపోజ్ చేశాడు. తర్వాత ఆమె పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus