Rana: గోపీచంద్ రిజెక్ట్ చేస్తే రానా ఓకె చేశాడా..!

  • May 30, 2023 / 02:24 PM IST

డైరెక్టర్ తేజ.. ఎంతో మంది హీరోలకు హీరోయిన్లకు లైఫ్ ఇచ్చాడు. ఉదయ్ కిరణ్, నితిన్, కాజల్ లతో పాటు ఈ లిస్ట్ లో గోపీచంద్ కూడా ఉన్నాడు. జయం, నిజం సినిమాల్లో గోపీచంద్ ను విలన్ గా చూపించిన తేజ.. ఆ తర్వాత గోపీచంద్ క్రేజీ హీరో అవ్వడంతో.. అతనితో ఓ సినిమా ప్లాన్ చేశాడు. అదే అలివేలు మంగ వెంకటరమణ.. కానీ ఈ ప్రాజెక్టులో హీరోయిన్ సెట్ అవ్వకపోవడంతో, తేజ ఈ ప్రాజెక్టు కి గ్యాప్ ఇచ్చాడు.

ఆ టైంలో గోపీచంద్ బిజీ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత గోపీచంద్ ఫోన్ ఎత్తడం మానేసినట్టు ఇటీవల రామబాణం ప్రమోషన్లో తేజ చెప్పాడు. ఆ సందర్భంలో గోపీచంద్.. ఆ కథ నేను మోయలేనిది, అందులో హీరోయిన్ పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది, మీ ఫోన్ ఎత్తితే నేను ఓకే చెప్పేస్తాను, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటూ గోపీచంద్ చెప్పాడు. అది నిజమే అన్నట్టు కూడా తేజ క్లారిటీ ఇచ్చాడు.

ఇదిలా ఉండగా.. తేజ ..రానా తమ్ముడు, దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అయిన అభిరామ్ తో అహింస అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో తన నెక్స్ట్ సినిమా రానా తో అని తేజ రివీల్ చేయడం జరిగింది. ఇలా అనౌన్స్మెంట్ వచ్చిందో లేదో వెంటనే.. ఇది గోపీచంద్ రిజెక్ట్ చేసిన కథ అంటూ ప్రచారం మొదలైంది. కానీ ఈ ప్రచారంలో నిజం లేదని తేజ క్లారిటీ ఇచ్చాడు.

(Rana) రానాతో చేయబోయే సినిమా పేరు రాక్షస అనుకుంటున్నట్టు తెలిపాడు. సో అలివేలు మంగ వెంకటరమణ… అనే టైటిల్ కి రాక్షస అనే టైటిల్ కి చాలా తేడా ఉంది. పైగా రాక్షస టైటిల్ లో హీరోది మెయిన్ రోల్ అనే హింట్ కూడా ఉంది. సో రెండు కథలు వేరే వేరే . త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా లాంచ్ అవ్వనుంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus