Rana’s 1945 Collections: మొదటి రోజే దారుణమైన ఓపెనింగ్స్..!

  • January 8, 2022 / 04:10 PM IST

రానా, రెజీనా జంటగా సత్య శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘1945’.’కె.ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎస్.ఎన్.రాజ రాజన్, సి.కళ్యాణ్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ నిజానికి 4ఏళ్ళ క్రితం మొదలైంది. కానీ అనేక కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. మొత్తానికి ఆ అడ్డంకుల్ని అన్నిటినీ దాటుకుని జనవరి 7న(నిన్న) ఈ చిత్రం విడుదల అయ్యింది. నాజర్, సత్యరాజ్, సప్తగిరి వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండడంతో సినిమా బాగానే ప్రేక్షకుల్ని ఆకర్షించింది.

మార్నింగ్ షోలు ఎక్కువ చోట్ల లేకపోయినా నైట్ షోలు కొన్ని చోట్ల బాగానే హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఒకసారి మొదటి రోజు కలెక్షన్లని గమనిస్తే :

నైజాం  0.13 cr
సీడెడ్  0.06 cr
ఆంధ్రా(టోటల్)  0.11 cr
ఏపి+తెలంగాణ (టోటల్)  0.30 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
+ ఓవర్సీస్
 0.07 cr
వరల్డ్ వైడ్ టోటల్  0.37 cr

‘1945’ చిత్రాన్ని నిర్మాత సి.కళ్యాణ్ చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.25 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.మొదటి రోజు ఈ చిత్రం కేవలం రూ.0.37 కోట్ల షేర్ ను రాబట్టింది. కొన్ని చోట్ల డెఫిసిట్ లు పడ్డాయి. వాటి లెక్కలు ఇంకా బయటకి రాలేదు.ఏది ఏమైనా బ్రేక్ ఈవెన్ కు మరో కోటి పైనే ఈ చిత్రం షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘పుష్ప’ ‘అఖండ’ ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి పాత చిత్రాలు దీనికంటే బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. మరి వీకెండ్ ముగిసేసరికి ‘1945’ ఎంత రాబడుతుందో చూడాలి..!

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus