రెండో రోజు కూడా సూపర్ అనిపించిన రంగ్ దే కలెక్షన్స్.!

  • March 28, 2021 / 03:26 PM IST

యూత్ స్టార్ నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘రంగ్ దే’. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించాడు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ కావడం విశేషం. మార్చి 26న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి.

ఇక ఈ చిత్రం 2 డేస్ కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే :

నైజాం   2.67 cr
సీడెడ్   0.93 cr
ఉత్తరాంధ్ర   0.92 cr
ఈస్ట్   0.68 cr
వెస్ట్   0.41 cr
గుంటూరు   0.85 cr
కృష్ణా   0.37 cr
నెల్లూరు   0.33 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   7.16 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   0.45 cr
ఓవర్సీస్   0.90 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   8.51 cr

‘రంగ్ దే’ చిత్రానికి 23.9కోట్ల బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు 24.4కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 5.43కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాదించాలి అంటే ఇంకా 15.89 కోట్ల షేర్ ను రాబట్టాలి.హోలీ హాలిడే కూడా ఉండడం ఈ చిత్రానికి పెద్ద అడ్వాంటేజ్ గా చెప్పాలి.

Click Here To Read Movie Review

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus