కరియర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన చైతూ !

  • June 5, 2017 / 07:47 AM IST

మంచి సినిమాని మన తెలుగువాళ్ళు ఎప్పుడూ ఆదరిస్తారు అనే నిజం మరోసారి రుజువుఅయ్యింది. అవును హీరోగా మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న నాగార్జున నిర్మాతగా సైతం మంచి రుచి ఉన్న నిర్మాతగా ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ ఉన్నాడు. చిన్న సినిమాల నుంచి బడా సినిమాల వరకూ నిర్మాణాలు చేపడుతూ మంచి నిర్మాత అనిపించుకుంటున్నాడు. అయితే నిర్మాతగానే మంచి సినిమాలు అందిస్తున్న నాగ్ తన కుమారుడు నాగచైతన్యతో నిర్మించిన “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ కురిపిస్తూ దూసుకుపోతుంది. సినిమా రిలీజ్ రోజునుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది అనే చెప్పాలి. ఇప్పటికీ మంచి సినిమాగా రన్ అవుతున్న ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకోవడంలో మంచి మార్క్స్ వేయించుకుంది.

అందుకే ఈ సినిమా అంతటి ఘన విజయం సాధించింది అని టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న మ్యాటర్. ఇక వసూళ్ల లెక్కలే తీసుకుంటే, మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 32 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం తొమ్మిది రోజులు గడిచే సరికి రూ. 35 కోట్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. ఇక వేసవి సెలవులు ముగియకపోవడంతో ఈ సినిమా వసూళ్లు ఇలాగే కొనసాగే అవకాశం చాలానే ఉంది. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా చైతు కరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలబడుతుంది అని ట్రేడ్ అన్యాలిసిస్ నుంచి వినిపిస్తున్న వాదన. చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus