Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

అక్కినేని నాగ చైతన్య ఎక్కువగా క్లాస్ సినిమాలు, అప్పుడప్పుడు యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చారు. అయితే అతను హీరోగా తెరకెక్కిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘రారండోయ్ వేడుక చూద్దాం'(Rarandoi Veduka Chudham).

Rarandoi Veduka Chudham

నాగార్జునతో ‘సోగ్గాడే చిన్ని నాయన’ వంటి సూపర్ హిట్ మూవీ తీసిన కళ్యాణ్ కృష్ణ కురసాల దీనికి దర్శకత్వం వహించాడు.  దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ సినిమాలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అనే చెప్పాలి. అందువల్ల మొదట ఈ సినిమాకి మంచి బజ్ వచ్చింది.

 తర్వాత ప్రమోషన్స్ లో దివంగత నటుడు చలపతి రావు లేడీస్ మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దాంతో సినిమాకి మరింతగా పబ్లిసిటీ వచ్చింది. 2017 మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. తొలి రోజు కొంత మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కాంబినేషన్ క్రేజ్ యాడ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. నేతితో ఈ సినిమా విడుదలై 9 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న నేపధ్యంలో.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 9.05 cr
సీడెడ్ 2.85 cr
ఉత్తరాంధ్ర 3.65 cr
ఈస్ట్ 2.01 cr
వెస్ట్ 2.32 cr
గుంటూరు 1.80 cr
కృష్ణా 1.72 cr
నెల్లూరు 0.68 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 23.08 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 1.60 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 27.19 cr

‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రం రూ.22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఏకంగా రూ.27.19 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.50 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బయ్యర్లకు మొత్తంగా రూ.5.19 కోట్ల లాభాలు మిగిల్చి.. సూపర్ హిట్ గా నిలిచింది ‘రారండోయ్ వేడుక చూద్దాం’.

మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus