Rashmi Gautam: ఇన్నేళ్ళైనా రష్మీ ఇంకా తెలుగు పూర్తిగా నేర్చుకోలేదా.. హాట్ టాపిక్ అయిన లేటెస్ట్ వీడియో..!

జబర్దస్త్ యాంకర్ రష్మీ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జన్మించినప్పటికీ.. అది కూడా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ ఆమె తల్లి ఒడిశాకు చెందిన వ్యక్తి, తండ్రి ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వ్యక్తి కావడంతో ఆమెకు తెలుగు అంతంత మాత్రంగానే వచ్చు.దీని వల్ల ఆమె కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు పడింది. సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. ఆమె గ్లామర్ తో నెట్టుకురావాలని చూసింది కానీ.. అది వర్కౌట్ అవ్వకపోవడం వల్ల.. చాలా కాలం ఈమె ఖాళీగా ఉంటూ వచ్చింది.

అయినప్పటికీ చాలా కష్టపడి జబర్దస్త్ కి యాంకర్ అయ్యే అవకాశాన్ని దక్కించుకుంది. ఈమె మాట్లాడే తెలుగు పై టీం లీడర్లు కూడా బోలెడన్ని పంచ్ లు వేసినప్పటికీ.. ఈమె అక్కడ నిలబడగలిగింది. తర్వాత బోలెడన్ని షోలకు హోస్ట్ గా చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికీ రష్మీ తెలుగు స్పష్టంగా నేర్చుకోలేదని మరోసారి స్పష్టమయింది. వివరాల్లోకి వెళితే.. ‘ఆహా’ ఓటీటీ కోసం ‘చెఫ్ మంత్ర సీజన్-2’ ని హోస్ట్ చేయబోతుంది మంచు లక్ష్మి.

అందుకు సంబంధించి ఓ గ్లిమ్ప్స్ ను కూడా వదిలారు. ఆల్రెడీ అన్ని ఎపిసోడ్ లకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టు ఈ గ్లిమ్ప్స్ క్లారిటీ ఇచ్చింది.ఇదిలా ఉండగా.. ‘చెఫ్ మంత్ర సీజన్-2’ లో ఓ ఎపిసోడ్ కోసం గెటప్ శ్రీనుతో కలిసి యాంకర్ రష్మి కూడా పాల్గొంది. వీరి ఎపిసోడ్లో గెటప్ శ్రీనుతో కలిసి బూరెలు, గారెలు వండిన రష్మి.. గారెలను(వడలు) వర్ణించే క్రమంలో ఒక బూతు పదం పలికింది.

‘నా వడలో కూడా బొ** ఉంది’ అని రష్మీ అంటుంటే అది వినలేక మంచు లక్ష్మీ చెవులకు బదులు కళ్ళు మూసుకోవడం ఈ ప్రోమోకి హైలెట్ గా నిలిచింది.ఈ క్రమంలో గెటప్ శ్రీను..అది రంధ్రం అను అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus