Rashmika: పుష్ప మూవీతో అద్భుతాలు జరగబోతున్నాయా..

  • April 27, 2021 / 04:41 PM IST

ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న సినిమాలలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, పుష్ప సినిమాలపై ప్రేక్షకుల్లో ఎక్కువగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచుతాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. పుష్ప సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రష్మిక బన్నీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ చాలా స్వీటెస్ట్ పర్సన్ అని తాను ఎవరినీ ఎక్కువగా పొగడననని రష్మిక అన్నారు.

పుష్ప సినిమాపై ప్రేక్షకుల్లో ఏర్పడిన క్రేజ్ గురించి మాట్లాడుతూ కరోనా నిబంధనలు పాటిస్తూ పుష్ప మూవీ షూటింగ్ జరుగుతోందని పుష్ప సినిమా ప్రేక్షకులందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుందని రష్మిక చెప్పుకొచ్చారు. పుష్ప సినిమాతో అద్బుతాలు జరుగుతాయని రష్మిక అభిప్రాయపడ్డారు. అల్లుఅర్జున్ – సుకుమార్ – మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కలయికతో అద్భుతాలు జరగబోతున్నాయంటూ రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కలయికే అద్భుతం అయితే ఇంకేం కావాలంటూ ప్రేక్షకులనే రివర్స్ లో రష్మిక ప్రశ్నించారు.

రష్మిక తన వ్యాఖ్యలతో పుష్ప సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలను పెంచేశారు. ఈ సినిమా ఆగష్టు నెల 13వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా రిలీజ్ డేట్ మారే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆచార్య మూవీని వాయిదా వేస్తున్నట్టు అధికారక ప్రకటన వెలువడగా ఈ సినిమా ఆగష్టు 22వ తేదీన మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ కానుందని సమాచారం. ఆచార్య మూవీ ఆరోజునే రిలీజ్ అయితే మాత్రం పుష్ప రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus