ఆ నిర్మాతతో రష్మిక రిలేషన్ లో ఉందా..?

కన్నడ భామ రష్మిక ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా నిలిచి తన పాపులారిటీ మరింత పెంచుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. ఈ బ్యూటీ మలయాళ దర్శక, నిర్మాత చిరంజీవ్ మక్వానాతో రష్మిక రిలేషన్ లో ఉందట. ఈ విషయాన్ని ప్రముఖ ఫిలిమ్స్ డేటాబేస్ సంస్థ ఐఎండీబీ స్పష్టం చేసింది. ఐఎండీబీలో రష్మిక బయోగ్రఫీలో ఈ విషయాన్ని రాసుకొచ్చారు. నిజానికి చిరంజీవ్ మక్వానా.. అనుపమా పరమేశ్వరన్ ప్రియుడు అని ప్రచారంలో ఉంది.

అందుకే అనుపమా బాయ్ ఫ్రెండ్ తో రష్మిక రిలేషన్ లో ఉందంటూ ఐఎండీబీలో అప్డేట్ చేశారు. మరి ఈ విషయంపై రష్మిక కానీ చిరంజీవ్ కానీ స్పందిస్తారేమో చూడాలి. నిజానికి రష్మిక గతంలో దర్శకుడు, నటుడు రక్షిత్ శెట్టిని ప్రేమించింది. అతడితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ వ్యక్తిగత కారణాల వలన పెళ్లి రద్దు చేసుకుంది. టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తుండడంతో హీరోయిన్ గా తన జర్నీ కంటిన్యూ చేయడానికి ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసుకుందనే గుసగుసలు వినిపించాయి.

ఆ తరువాత సినిమాల్లో బిజీ అయిన తరువాత తన కోస్టార్ విజయ్ దేవరకొండతో ప్రేమాయణం సాగించిందని వార్తలొచ్చాయి. అయితే అందులో నిజం లేదని రష్మిక, విజయ్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు అనుపమ బాయ్ ఫ్రెండ్ తో రష్మిక డేటింగ్ చేస్తుందనే వార్త బయటకి రావడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus