లవ్ ఎఫైర్స్ పై రష్మిక సంచలన కామెంట్స్

  • September 5, 2020 / 04:39 PM IST

టాలీవుడ్ లక్కీ లేడీ లవ్ ఎఫైర్స్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె సుదీర్ఘ విశ్లేషణ ఇవ్వడం జరిగింది. రష్మికను ఓ ఫ్యాన్ మీరు సింగిలేనా అని అడిగారు. దానికి సమాధానంగా రష్మిక అవును నేను సింగిల్ గానే ఉన్నారు. సింగిల్ గా ఉండడం వలన జీవితం హ్యాపీగా ఉంటుంది. అలాగే సింగిల్ లైఫ్ వలన మనకు కాబోయేవాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలుస్తుంది. ఐతే సింగిల్ స్టేటస్ వలన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.

ఎవరితోనూ రిలేషన్ లో లేమని తెలిస్తే ఎవరో ఒకరితో లింకులు పెడుతూ కథనాలు రాస్తూ ఉంటారు. కావున నాకు లవ్ ఎఫైర్స్ ఉన్నాయని రాయకండి ప్లీజ్ అని రష్మిక వేడుకోవడం జరిగింది. ఎవరితో ఒకరితో ప్రేమలో ఉన్నామని తెలిస్తే వారి గురించే రాస్తారు, అలా లేని పక్షంలో అనేక మందితో లింకులు పెట్టి రోజుకో కథనం రాస్తారని రష్మిక పరోక్షంగా చెప్పడం జరిగింది. ఇక రష్మిక లవ్ ఎఫైర్స్ గురించి మాట్లాడుకోవాలంటే, కెరీర్ బిగినింగ్ లోనే కన్నడ హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో ఈమె పడిపోయింది.

పెళ్ళికి సిద్దమైన ఈ జంట నిశ్చితార్ధం కూడా జరుపుకున్నారు. వ్యక్తిగత కారణాల వలన వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో పెళ్ళికి ముందే విడిపోయారు. ఆ తరువాత టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు రశ్మికకు మధ్య సంథింగ్ సంథింగ్ అని పుకార్లు రావడం జరిగింది.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus