ఆ మధ్య ‘రామాయణ’ సినిమా పార్ట్ 1 టీజర్ వచ్చినప్పుడు కొంతమందికి వచ్చి డౌట్, మనం కూడా అనుకున్న డౌట్ ఈ సినిమా విషయంలో కూడా ‘ఆదిపురుష్’ సినిమాకు చేసిన తప్పే చేస్తున్నారా అని. అంటే ‘ఆదిపురుష్’ సినిమా విషయంలో కాస్త కథను అటు ఇటు ఇబ్బంది పెట్టారని.. అదనపు హంగులకు పోయారని.. ఫ్లో మిస్ అయిందని.. ఇలా రకరకాల విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ‘రామాయణ’ సినిమాలోనూ అదే చేస్తున్నారు అని అనుకున్నాం.
అయితే, లేటెస్ట్‌గా వచ్చిన ఓ రూమర్.. ఇప్పుడు సినిమా మీద అలాంటి అనుమనాలను బలపరిచేలా ఉంది. దానికి కారణం మనకు తెలిసిన రామాయనాన్ని ముందు, వెనుక చేసి చూపిస్తున్నారు అనే సమాచారం బయటకు వచ్చింది. అంటే మన కమర్షియల్ సినిమాల స్టైల్‌లో తర్వాత జరిగింది ముందు చూపించి.. ‘అప్పుడేమైందంటే.. గిరా గిరా గిరా’ అంటూ వెనక్కి తిప్పి అప్పటి కథను చూపించినట్లు ‘రామాయణ’ను చూపిస్తారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
‘రామాయణ 1’ను దీపావళికి తీసుకొస్తామని టీమ్ అయితే చాలా నెలల క్రితమే చెప్పేసింది. అయితే ఇప్పటివరకు డేట్‌ని ఇంకా అనౌన్స్ చేయలేదు. దీంతో నవంబరు 6న కానీ 7న కానీ సినిమా రావొచ్చు అనే ఊహాగానాలు వస్తున్నాయి. రెండో పార్టును వచ్చే ఏడాది దీపావళికి తీసుకొస్తమని ఇప్పటికే చెప్పేశారు. అయితే ఇప్పుడు వచ్చే పార్టులో రావణుడి పాత్ర మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు అని చెబుతున్నారు. అంటే రావణ కాలం తర్వాత రాముడి దగ్గరకు వెళ్తారని టాక్.
అదేంటి రాముడు – సీత కథ తెలిశాక.. వాళ్ల వనవాసం టైమ్‌లో రావణుడి పాత్ర ఎంట్రీ ఉంటుంది. మరి ‘రామాయణ’ టీమ్ ఇలా ఎందుకు చేస్తోంది. దీని వెనుక కారణమేంటో ఆ సినిమా టీమ్ ప్రచారం షురూ చేస్తే కానీ బయటకు రాదు. అన్నట్లు ‘రామాయణ’ పార్ట్ 1 టీజర్ అంతా రావణుడిని హైలైట్ చేస్తున్నట్లుగానే సాగింది. ఎక్కువగా దశకంఠుడే కనిపించాడు.