Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Advertisement

రూ.4000 కోట్ల అతి భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న సినిమా ‘రామాయణ’. ఇటీవల తొలి భాగం టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తున్నాడు అని చెబుతూ హనుమాన్ జయంతి సందర్భంగా ఆ వీడియోను తీసుకొచ్చారు. రాముడి పాత్రను పరిచయం చేస్తూనే.. సినిమాలో ముఖ్య పాత్రధారులను చూచాయగా పరిచయం చేశారు. మధ్యలో రెండు విచిత్రమైన పాత్రలు కూడా కనిపించాయి. మంచు ప్రాంతంలో యుద్ధం కూడా చూపించి కాస్త డౌట్స్‌ క్రియేట్‌ చేశారు.

Ramayana

దాంతోపాటు మరో డౌట్‌ కూడా క్రియేట్‌ అయింది. అదే రావణుడి పాత్ర. ఈ సినిమాలో రావణుడి పాత్ర ఎలా ఉండబోతోంది అనేది క్లియర్‌గా ఆ వీడియోలో చూపించలేదు. అయితే ఇప్పుడు సినిమా టీమ్‌ చెబుతున్న విషయాలు వింటుంటే రావణుడికి కాస్త పాజిటివ్‌గా చూపించే ప్రయత్నం జరుగుతోంది అని అర్థమవుతోంది. మనకు తెలిసినంతవరకు ‘రామాయణం’లో రావణుడు విలన్‌. ఎన్నో సినిమాల్లో మన దర్శకులు ఇదే చూపించారు, మనం చూశాం కూడా. అయితే రావణుడి గురించి పాజిటివ్‌గా కొన్ని సినిమాల్లో చూపించారు.

ఇప్పుడు నితీశ్‌ తివారీ ‘రామాయణ’ ప్రచారంలో కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. రావణుడి పాత్రను నెగిటివ్‌గా మాత్రమే చూపించడం లేదని దర్శకుడు నితీశ్‌ క్లారిటీ ఇచ్చేశారు. రావణుడిలోని ఇతర కోణాలను కూడా సినిమాలో చూపిస్తామని చెప్పారు. రావణుడి జీవితంలో ఎన్నో ఆసక్తికర కోణాలున్నాయి. ఆయన ఒక గొప్ప యోధుడు. నిష్ణాతుడైన సంగీత కళాకారుడు. దయగల రాజు. గొప్ప శివ భక్తుడు. అందుకే రావణుడిని నెగిటివ్‌ పాత్రలో చూపించడం లేదు అని తెలిపారు. ఆయనలో గొప్ప లక్షణాలను ప్రేక్షకులకు చూపిస్తామన్నారు.

ఇప్పుడు ఈ మాటలే చర్చకు దారి తీశాయి. ఎందుకంటే రావణుడి పాత్ర గురించి పాజిటివ్‌గా చూపిస్తే ప్రస్తుత ప్రేక్షకులు, ట్రోలర్లు ఎంతవరకు ఊరుకుంటారు అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా మనోభావాల చుట్టూనే తిరుగుతోంది సోషల్‌ మీడియా. చూద్దాం దీపావళికి సినిమా వచ్చినప్పుడు అసలు విషయం తేలుతుంది.

అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus