కొన్నిసార్లు ఒక సినిమా పూర్తయిన తరువాత హీరో లేదా హీరోయిన్ ఆ సినిమాకి దూరంగా ఉంటారు. ప్రమోషన్స్ కి రారు. ఆ సినిమా గురించి ఎక్కడా మాట్లాడరు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. సినిమా అవుట్ పుట్ నచ్చకనో, రెమ్యునరేషన్ పూర్తిగా రాకపోవడమో, తమ పాత్రకు పాముఖ్యత లేకపోవడం ఇలాంటి కారణాల వలన సినిమాకి దూరంగా ఉంటారు. రీసెంట్ గా ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా విషయంలో తమన్నా కూడా ఇలానే చేసింది.
అసలు ఈ సినిమాను తమన్నా పట్టించుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు. దీనికి కారణం ఏంటా..? అని అందరూ చర్చించుకున్నారు. రిలీజ్ కు వారం ముందు వరకు ఆమె ఈ సినిమాతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లే వ్యవహరించింది. కొన్నేళ్లుగా తన సినిమాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న తమన్నా.. ఈ సినిమాకి మాత్రం చెప్పలేదు. దీంతో ఏం జరిగి ఉంటుందా..? అని సందేహాలు నెలకొన్నాయి. అయితే రిలీజ్ కి ముందు టీమ్ ఎలాగోలా తమన్నాను ఒప్పించి ప్రమోషన్స్ కు తీసుకొచ్చారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ తో పాటు ప్రెస్ మీట్ కు కూడా హాజరైంది తమన్నా. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చింది. సినిమాలో తమన్నాకు కీలక పాత్రే దక్కింది. అలాంటప్పుడు ఆమె సినిమాకి ఎందుకు దూరంగా ఉందని చూస్తే.. తన పాత్రను తీర్చిదిద్దిన విధానమే కారణమని అనిపిస్తుంది. ఈ సినిమాలో తమన్నా పాత్రకు ట్రాజిక్ ఎండింగ్ ఇచ్చారు.
ఆమెని క్యాన్సర్ పేషేంట్ గా చూపించారు. ట్రీట్మెంట్ లో భాగంగా జుట్టు ఊడిపోవడం, గుండు చేయించుకోవడం లాంటి సన్నివేశాలు చూపించారు. తమన్నా లాంటి గ్లామరస్ బ్యూటీని అలాంటి పాత్రలో చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఈ లుక్స్ తమన్నాకు సూట్ కాలేదు. ఎలాగోలా నటించి ఉండొచ్చు కానీ ఈ పాత్రను చూపించిన తీరు ఆమెకి నచ్చక, ఈ సినిమా తన కెరీర్ పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందేమోనని ఆమె సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉందనిపిస్తుంది.
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!