వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెన ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఎక్కువగా విజయ్ సేతుపతి విలన్ పాత్రతోనే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే విడుదలైన ట్రైలర్ లో సేతుపతి డబ్బింగ్ పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. విజయ్ సేతుపతికి తెలుగులో ఫ్యాన్స్ బేస్ గట్టిగానే ఉంది. ఇదివరకే అతని సినిమాలు కొన్ని చూసిన అభిమానులు ఉప్పెనలో డబ్బింగ్ సెట్టవ్వలేదని కామెంట్స్ ఎక్కువగా చేశారు.
అరుంధతి బొమ్మాలి రవి శంకర్ తో డబ్బింగ్ చెప్పించిన విషయం తెలిసిందే. అయితే ఆయనతో చెప్పించడానికి గల కారణాన్ని కూడా చెప్పాడు దర్శకుడు బుచ్చిబాబు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉండడం వలన ఆయననే తన డబ్బింగ్ ఏ మాత్రం సెట్టవ్వదని చెప్పేశారు. చాలా భయంకరమైన క్యారెక్టర్ కాబట్టి నార్మల్ వాయిస్ సెట్టవ్వదు. బేస్ వాయిస్ తప్పకుండా ఉండాలని అనుకున్నాము. తరువాత చాలా మందిని ట్రై చేశాం. యాక్టర్ అజయ్ తో కూడా చెప్పించాలని అనుకున్నాము.
కానీ చివరికి రవి శంకర్ తో చెప్పించాము. ఆయన ముడు రోజులు టైమ్ తీసుకొని చెప్పారు. సినిమాలో తప్పకుండా అందరికి ఆ పాత్ర నచ్చుతుందని అన్నారు.
Most Recommended Video
వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!