మొత్తానికి మహేష్ బాబు ఇస్మార్ట్ శంకర్ సినిమా చూశాడన్నమాట

Advertisement

ఒక స్టార్ హీరో ఒక చిన్న సినిమా గురించి కానీ.. తాను చూసిన సినిమా గురించి కానీ ట్వీట్ వేయడం అనేది సదరు సినిమాకి ఎంతలా పనికొస్తుంది అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ వేసే ఒక్క ట్వీట్ కరణంగా కలెక్షన్స్ లోనూ భారీ స్థాయిలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈమధ్యకాలంలో మహేష్ బాబు తాను ఫ్రీగా ఉన్నప్పుడు చిన్న-పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి సినిమా చూసి బాగుంటే ట్వీట్ చేయడం అనేది గత కొన్నాళ్లుగా ఫాలో అవుతున్న ట్రెండ్. ఈ కారణంగా జనాలకు అసలు విడుదలైంది అని తెలియని చాలా చిత్రాలకు మంచి బూస్ట్ వస్తుండగా.. స్టార్ హీరోల నడుమ మంచి ర్యాపో కూడా పెరుగుతోంది.

అయితే.. తన ఫేవరెట్ డైరెక్టర్ అయిన పూరీ జగన్నాధ్ తీసిన “ఇస్మార్ట్ శంకర్” గురించి మాత్రం మహేష్ బాబు ట్వీట్ చేయలేదు. దాంతో పూరీ మీద ఉన్న కోపంతో మహేష్ బాబు సినిమా చూడలేదేమో అనుకొన్నారు అందరు. కానీ.. మొన్నామధ్య అన్నపూర్ణ స్టూడియోస్ లో కలుసుకొన్న రామ్-మహేష్ బాబులు ఇస్మార్ట్ శంకర్ గురించి చర్చించుకొన్నారట. రామ్ నటనను మహేష్ మెచ్చుకొన్నాడట. దాంతో మహేష్ బాబు “ఇస్మార్ట్ శంకర్” సినిమా చూశాడనే విషయం కన్ఫర్మ్ అయినప్పటికీ.. పూరీ కోపంతోనే ఆ సినిమా గురించి ట్వీట్ చేయలేదని స్పష్టమైంది. మరి ఈ కోపతాపాలు ఎన్నాళ్లు ఉంటాయో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus