దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలుగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె నాగచైతన్యత విడాకులు తీసుకున్న తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా సినిమా షూటింగులతో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండేవారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఆసక్తికరమైన పోస్టులు చేస్తూ నిత్యం అభిమానులను సందడి చేసేది. ఈ విధంగా ప్రతిరోజు ఇంస్టాగ్రామ్ వేదికగాను లేదా ట్విట్టర్ వేదికగా తనకు సంబంధించిన విషయాలను
సినిమా అప్డేట్లను అందరితో పంచుకుంటూ రోజురోజుకు అభిమానులను పెంచుకున్న సమంత గత రెండు వారాల నుంచి సోషల్ మీడియాకు పూర్తిగా దూరమయ్యారు. ఈ విధంగా ఈమె సోషల్ మీడియాలో ఒక్క పోస్టు కూడా చేయకపోవడంతో అభిమానులు ఏమైందని ఆరా తీస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ కొటేషన్స్ ద్వారా అందరినీ పలకరించే సమంత గత రెండు వారాల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఇలా ఈమె దూరంగా ఉండడానికి కారణం ఏమిటి అని ఆరా తీయగా
గత కొద్ది రోజుల క్రితం సమంతా సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్ కి గురైందని వార్తలు వచ్చాయి . అప్పటినుంచి ఈమె సోషల్ మీడియాకు దూరమయ్యారు. ఇలా ఈమె సోషల్ మీడియాకు దూరం కావడంతో కొంతమంది ఆమె సోషల్ మీడియా డిటాక్స్‌లో ఉందని అంటుంటే.. మరికొంతమంది ఆమె వ్యక్తిగత కారణాలవల్లే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారని భావిస్తున్నారు.
ఇక సమంత వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇలా ఉన్నఫలంగా సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండి మౌనం వహించడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు.అయితే సమంత ఇలా మౌనం వహించడానికి గల కారణం ఏమిటో తెలియాలంటే ఈ విషయంపై ఆమె స్పందించాల్సి ఉంది.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!