ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. జూన్ 16 న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు తిరుపతిలో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది ఫాన్స్ నడుమ ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
టీ సిరీస్ మరియు యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ‘ఆదిపురుష్’ యూనిట్ తో పాటు ముఖ్య అతిథి గా ప్రముఖ ఆద్యాథ్మిక గురు చిన్న జియర్ స్వామి గారు హాజరయ్యారు.ఇదిలా ఉండగా.. ప్రభాస్ స్పీచ్ ఇస్తున్న టైంలో అంతా ‘పెళ్లి ఎప్పుడు’ అంటూ అరుస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలో ప్రభాస్ కు వేరే ఆప్షన్ లేకపోవడంతో పెళ్లి పై స్పందించి క్లారిటీ ఇచ్చాడు.
‘నేను (Prabhas) తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అది కూడా తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటాను. ఎప్పుడు అనేది మాత్రం త్వరలోనే వెల్లడిస్తాను ‘ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ‘ఆదిపురుష్’ హీరోయిన్ కృతి శెట్టితో ప్రభాస్ ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. వీళ్ళు పెళ్లి చేసుకోవడం పక్కా అని చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇందులో నిజం లేదని ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. కృతి సనన్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ప్రభాస్ తిరుపతిలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరై ఉంటారో చూడాలి..!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు