మెగాస్టార్ సినిమాకి నో చెప్పిన రెజీనా.. కారణం?

టాలీవుడ్ లో కుర్ర హీరోలందరి సరసన నటించి క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది రెజీనా. అయితే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మాత్రం దక్కించుకోలేకపోయింది. నటిగా.. మంచి డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న రెజీనాకు ఆ తరువాత పెద్దగా ఆఫర్లు రాలేదు. కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఈమెను దర్శక నిర్మాతలు పూర్తిగా పక్కనపెట్టేశారనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు ‘ఎవరు’ చిత్రం మంచి బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ చిత్రంలో రెజీనా నటనకి కూడా మంచి ప్రశంసలు దక్కాయి.

దీంతో ఈమెకు మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో ఛాన్స్ వస్తే… ఈమె తిరస్కరించిందట. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా త్రిష ఎంపికైనట్టు టాక్ నడుస్తుంది. మరోపక్క రెజీనా కూడా మరో హీరోయిన్ గా అనుకున్నారట. ఈమెతో ఓ ఐటెం సాంగ్ కూడా అనుకున్నారట. కానీ రెజీనా మాత్రం ఇందుకు నో చెప్పిందట. మెగాస్టార్ తో డ్యాన్స్ చేయాలని ఎదురుచూస్తున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. రెజీనా కూడా ఆ కోవకి చెందిన హీరోయినే..! కానీ ఆమె ప్రస్తుతం తమిళంలో 6 సినిమాలు చేస్తోంది. వాటిలో 4 సినిమాలు సెట్స్ పై వున్నాయి. డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఈ ఆఫర్ కు రెజీనా నో చెప్పినట్టు తెలుస్తుంది.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus