మెగాస్టార్ కు నితిన్ అత్తామావలుకి ఉన్న సంబంధం అదే..!

నిజానికి ఏప్రిల్ లోనే నితిన్ పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. కానీ వైరస్ మహమ్మారి ఎంట్రీ కారణంగా అతని మ్యారేజ్ వాయిదా పడింది. ఈ వైరస్ మహమ్మారి హడావిడి పూర్తిగా తగ్గాకే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు నితిన్. కానీ వీరి జాతకాల ప్రకారం మంచి ముహూర్తం మిస్ అయిపోకూడదు అనే ఉద్దేశంతో.. జూలై 26న(నిన్న) పెళ్లి చేసుకున్నాడు.అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నితిన్ భార్య పేరు షాలిని అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.

‘ఇష్క్’ సినిమా టైంలో వీరిద్దరూ కలుసుకున్నారు. ఓ మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా వీరికి పరిచయం ఏర్పడటం.. తరువాత అది ప్రేమగా మారడం.. ఇప్పుడు పెళ్లి వరకూ వెళ్లడం జరిగింది. ఇదిలా ఉండగా.. నితిన్ భార్య షాలినీ కుటుంబానికి.. అలాగే మెగాస్టార్ చిరంజీవికి ఓ ప్రత్యేక అనుబంధం ఉందట. వివరాల్లోకి వెళితే.. షాలిని తల్లితండ్రులు అయిన సంపత్ కుమార్, షేక్ నూర్జహాన్ నాగర్ లు ఇద్దరూ డాక్టర్లే. వీళ్లది ప్రేమ పెళ్లి.వీళ్ళు కర్నూలులో గత 20 ఏళ్లుగా ప్రగతి నర్సింగ్ హోమ్‌ను రన్ చేస్తున్నారు.

షాలిని తల్లి నూర్జహాన్ నాగర్ ‌కు చిరంజీవితో మంచి అనుబంధం ఉంది. 2008 ఆగష్ట్ లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇక 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరుపున కర్నూల్ జిల్లా నియోజిక వర్గం నుండీ నాగర్ ను నిలబెట్టారు చిరు. కానీ నాగర్ ఓటమి పాలయ్యారు. తరువాత ఈమె కూడా రాజకీయాలకు దూరమయ్యారుని తెలుస్తుంది. అయినప్పటికీ చిరుతో సంపత్, నగర్ ల స్నేహం కొనసాగుతూనే ఉందని సమాచారం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50


Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus