ఎన్టీఆర్, నాని, నాగ్.. ఎంతెంత తీసుకున్నారంటే..?

Advertisement

ఉత్తరాదిన ఎంతో పాపులర్ అయిన ‘బిగ్ బాస్’ రియాలిటీ షో.. సౌత్ లో కూడా ప్రారంభం అవ్వగా ఇక్కడ కూడా బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అందులోనూ తెలుగులో ఈ షోకి మంచి ఆదరణ దక్కింది. మొదటి సీజన్ నే ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో హోస్ట్ చెయ్యడంతో ఈ షోకి శుభారంభం దక్కినట్టు అయ్యింది. ఇక రెండో సీజన్ ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశాడు. ఈ సీజన్లో కొన్ని కాంట్రావర్సీలతో హోస్ట్ నాని ఇబ్బంది పడినప్పటికీ దీనిని కూడా సూపర్ హిట్ చేశాడు. ఇక మూడో సీజన్ ను ‘కింగ్’ నాగార్జున హోస్ట్ చేసి దీనిని బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాడు.

ఇప్పుడు నాలుగో సీజన్ ను కూడా నాగార్జునే హోస్ట్ చెయ్యబోతున్నారు. వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా ‘బిగ్ బాస్4’ లేట్ గా ప్రారంభమవుతుంది. ఆగష్ట్ 30న ‘బిగ్ బాస్4’ మొదలు కానుందని సమాచారం. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకూ జరిగిన మూడు సీజన్స్ లో .. ‘బిగ్ బాస్’ హోస్ట్ లకు ఎంతెంత పారితోషికాలు ఇచ్చారు అనే అనుమానం అందరిలోనూ ఉంది.అందుతున్న సమాచారం ప్రకారం.. మొదటి సీజన్ ను హోస్ట్ చేసిన ఎన్టీఆర్ కు.. ఒక్కో ఎపిసోడ్ కు గాను 35 లక్షల పారితోషికం ఇచ్చేవారట ‘బిగ్ బాస్’ నిర్వాహకులు.

ఇక నేచురల్ స్టార్ నానికి ఒక్కో ఎపిసోడ్ కు 12లక్షలు ఇచ్చేవారట. ఇక మూడో సీజన్ ను హోస్ట్ చేసిన నాగార్జునకు.. ఒక్కో ఎపిసోడ్ కు గాను 20లక్షలు ఇచ్చేవారని తెలుస్తుంది. ఇప్పుడు నాలుగో సీజన్ కు కూడా ఆయనకి ఒక్కో ఎపిసోడ్ కు గాను 20లక్షల పారితోషికమే ఇవ్వబోతున్నారని సమాచారం.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus