5 నిమిషాల ఐటెం సాంగ్స్ కే అన్నేసి లక్షలా.. వీళ్ళ డిమాండ్ మామూలుగా లేదుగా..!

ఇది వరకు పెద్ద హీరోల సినిమాలు అంటే కచ్చితంగా మాస్ సాంగ్ ఉండాల్సిందే..! అందుకోసం జయమాలిని,సిల్క్ స్మిత, జ్యోతి లక్ష్మి వంటి వారు ఉండేవారు. అప్పటి సినిమాల్లో వీళ్ళు వేమ్ప్ రోల్స్ కూడా చేసేవారు కాబట్టి అప్పటి దర్శకనిర్మాతలు వెళ్లనే ఎంపిక చేసుకునే వారు. కొన్నాళ్ల తరువాత అభినయ శ్రీ, ముమైత్ ఖాన్ వంటి వారు వీళ్ళను రీ ప్లేస్ చేశారు. అంతకు ముందు రంభ, రమ్య కృష్ణ వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్ లో నర్తించే వారు. ఇలాంటి పాటలు చేసినందుకు గాను వీళ్లకు అప్పట్లోనే లక్షల రూపాయల పారితోషికం ఇచ్చేవారు దర్శక నిర్మాతలు. అయితే ఈ మధ్య కాలంలో కాజల్, తమన్నా వంటి వారు ఇలాంటి పాటలు చెయ్యడానికి ముందుకు వస్తున్నారు. అయితే 5 నిమిషాల లోపు నిడివి గల పాటల్లో డ్యాన్స్ చేసినందుకు వీళ్లకు ఆ సినిమాల్లో హీరోయిన్లతో సమానంగా పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది. దాంతో ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు కొంతమంది దర్శకనిర్మాతలు.

అదేంటంటే.. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న భామలతోనూ లేదా యంగ్ హీరోయిన్లతోనూ ఐటెం సాంగ్స్ చేయిస్తే ఆ సాంగ్ క్లిక్ అవ్వడమే కాకుండా బోలెడంత డబ్బు కూడా మిగిలినట్టు అవుతుంది. తాజాగా హెబ్బా పటేల్, ‘బిగ్ బాస్4’ బ్యూటీ మోనాల్ గజ్జర్, ఆర్జీవీ హీరోయిన్ అప్సరా రాణి, జబర్దస్త్ బ్యూటీ వంటి వారు ఐటెం సాంగ్స్ చెయ్యడానికి ముందుకు వస్తున్నారు. వీరికి పారితోషికాలు కూడా లక్షల్లో ఇస్తున్నారు.

1) ‘రెడ్’ సినిమాలో ‘డించక్ డించక్’ పాట చెయ్యడానికి హెబ్బా పటేల్ 15 లక్షలు పారితోషికం అందుకుందట.

2) ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ఐటెం సాంగ్ చేసినందుకు గాను ‘బిగ్ బాస్4’ బ్యూటీ 13 లక్షల పారితోషికం అందుకుందట.

3)’క్రాక్’ చిత్రంలో ఐటెం సాంగ్ చెయ్యడం కోసం అప్సరా రాణి 9 లక్షల వరకూ పారితోషికం అందుకుందట.

4) ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో 4నిమిషాల లోపు ఐటెం సాంగ్ చెయ్యడం కోసం ‘జబర్దస్త్’ హాట్ యాంకర్ అనసూయ 20 లక్షల వరకూ పారితోషికం డిమాండ్ చేసిందట. ఇందుకు దర్శకనిర్మాతలు కూడా ఓకే చెప్పేసినట్టు సమాచారం.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus