Apsara Rani: కొత్త కారు కొన్న RGV బ్యూటీ!

సంచలన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం మాత్రం ఎవరూ ఊహించని స్థాయిలో అడుగులు వేస్తున్నాడు. గ్లామర్ బ్యూటీలు వైపు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు. ఒకప్పుడు సినిమాలతో బిజీగా ఉండే వర్మ ఇప్పుడు మాత్రం హాట్ బ్యూటీలతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేస్తూ విభిన్న తరహాలో కనిపిస్తున్నాడు. నెగిటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చినా కూడా ఆయన ఏమాత్రం లెక్క చేయడం లేదు. ఆర్జీవి దృష్టిలో పడిన కొంతమంది గ్లామర్ బ్యూటీ లకు కూడా బాగానే కలిసొస్తుందని చెప్పాలి.

ఇక ఉదాహరణకు అప్సర రాణి మొత్తానికి తన ట్రాక్ ను సెట్ చేసుకుంది. ఎందుకంటే ఈ బ్యూటీ ఆర్జీవి కలవక ముందు కనీసం సొంత కారు కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఉంది. ఇక ఏప్పుడైతే ఆర్జివి తో ఆమె రెగ్యులర్ గా టచ్ లో ఉండడం స్టార్ట్ చేసిందో ఆ తర్వాత బోల్డ్ సినిమాలు చేసుకుంటూ బాగానే పాపులారిటీని అందుకుంది.దానికితోడు వర్మ అప్సరను సోషల్ మీడియాలో బాగానే హైలెట్ చేశాడు. మొత్తానికి అప్సర క్రాక్, సీటీ మార్ వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి క్రేజ్ బాగానే అందుకుంది.

ఇక ఇటీవల ఈ అమ్మడు 20 లక్షల విలువగల జీప్ కంపాస్ కారు కొనుగోలు చేసింది. మొత్తానికి ఏదో ఒక విధంగా అప్సర రాణి ఇండస్ట్రీలో అయితే బిజీ గా మారుతుంది. చిన్న సినిమాలు చేసినప్పటికీ రెమ్యునరేషన్ మాత్రం బాగానే అందుకుంటున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఆషూ రెడ్డి కూడా ఆర్జివి తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ లైమ్ లైట్ లోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus