రీతూ చౌదరి పరిచయం అవసరం లేని పేరు. ఈమె పలు బుల్లి తెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతో సందడి చేశారు. ఇలా బుల్లితెర నటిగా ఉన్నటువంటి ఈమె అనంతరం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అవుతూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునేవారు. ఇక ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో కూడా సందడి చేశారు. ఇలా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి రీతు గురించి ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.
ఈమె శ్రీకాంత్ అనే ఒక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయిని ప్రేమిస్తున్నానని తన ప్రేమ విషయాన్ని బయట పెట్టారు. అదేవిధంగా తన నుదుటిపై ముద్దు పెడుతూ ఉన్నటువంటి ఒక వీడియోని షేర్ చేస్తూ ఈమె ఆ వీడియోని అందరితో పంచుకున్నారు. ఇది చూసి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి అయితే అభిమానులతో సరదాగా ముచ్చటించినటువంటి ఈమె తన ప్రియుడు గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు.
అదేవిధంగా పెళ్లి చేసుకున్నారా అంటూ కూడా ఈమెను ప్రశ్నించడంతో ప్రస్తుతం పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అనిపిస్తుంది అంటూ కూడా సమాధానాలు చెప్పడంతో బహుశా శ్రీకాంత్ రీతు మధ్య గొడవలు వచ్చాయని అందుకే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ వీరి బ్రేకప్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ వార్తలకు (Rithu Chowdary) రీతు చౌదరి ఫుల్ స్టాప్ పెట్టేసారు.
ఇక తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా తన ప్రియుడు శ్రీకాంత్ తో కలిసి దిగినటువంటి ఫోటోలను షేర్ చేశారు. ఇలా శ్రీకాంత్ తో కలిసి ఉన్నటువంటి ఫోటోని ఈమె షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ అయింది అలాగే తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పకున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని, వీరిద్దరూ ఎప్పటిలాగే ఎంతో సంతోషంగా ఉన్నారని ఈ ఫోటో ద్వారా తెలుస్తుంది.
మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?