బిగ్ బాస్ హౌస్ లో తమ ఫస్ట్ లవ్ స్టోరీలని చెప్తున్న కంటెస్టెంట్స్ ఇన్నేళ్లుగా తమ హృదయంలో దాచుకున్న వాటిని పూసగుచ్చినట్లుగా చెప్పారు. ఇందులో కాజల్ తన ప్రేమకథని చాలా ఇంట్రస్టింగ్ గా చెప్పింది. సినిమా స్టైల్లో ఉన్న ఆ కాజల్ లవ్ స్టోరీ ఏంటో కాజల్ మాటల్లోనే.. ” నాది సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీ. ఒకసారి మా అక్క పెళ్లిరోజు అని చెప్పి క్యాలెండర్ చేసేందుకు డిజైన్ షాప్ కి వెళ్లింది. అక్కతో పాటు నేను కూడా వెళ్లాను. అక్కడ ఆపరేటర్ నెంబర్ ఇచ్చారు.
అందులో 2 బదులు 3 ఉంది ఆ నెంబర్ డైల్ చేశాను. డిజైన్ అయ్యిందో లేదో తెలుసుకుందామని కాల్ చేశాను. రింగ్ టోన్ కూడ నొప్పి నొప్పి గుడెంత నొప్పి అనే పోకిరిలో పాట వచ్చింది. ఆ తర్వాత మేమిద్దరం ఈ మైయిల్ అడ్రస్ లు ఒకరినొకరు తీస్కున్నాం. అప్పట్నుంచీ మైయిల్స్ చేస్కునేవాళ్లం. ఈ విషయం తెలిసి మా ఇంట్లో నన్ను వైజాగ్ కి పంపించేశారు. చాలా సీరియస్ అయ్యారు. మళ్లీ మా పేరెంట్స్ వచ్చి ఇంటికి తీస్కుని వచ్చారు. ఇంట్లోనే ఉంచేసరికి చాలా టెన్షన్ పడ్డా..
నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి పోలీసులకి ఫోన్ చేశాను. 100 డైల్ చేస్తే పోలీసులు వచ్చారు. అమ్మా నాన్న భోజనం చేస్తున్నప్పుడు పోలీసులని చూసి ఖంగారు పడ్డారు. రామ్మా అంటూ నన్ను పిలిచే సరికి ఎలాంటి ఆలోచనలు లేకుండా వెళ్లి పోలీస్ జీప్ లో కూర్చున్నాను. నాకు అప్పుడు తెలియలేదు. నాకు కూతురు పుట్టిన తర్వాత ఆ ఇన్సిడెంట్ గుర్తుకువచ్చేదని అప్పుడు నా తప్పు నాకు తెలిసిందని చెప్పింది. నేను బయటకి వచ్చాక చాలా హ్యాపీగా ఉన్నా కానీ, పేరేంట్స్ ని సఫర్ చేసిన ఆరోజు ఇంకా గుర్తుండిపోయింది.
అది నేను క్షమించుకోలేకపోతున్నా. వాళ్లు నన్ను క్షమించారు. నేను బుద్దిలేకుండా ఆలోచించాను అని చెప్పి బాధపడింది. ఇప్పుడు నేను ఈ స్టేజ్ లో ఉన్నాను అంటే మా పేరెంట్స్ ఇప్పుడు నా కూతురుని చూస్కుంటూ నన్ను క్షమించారు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను క్షమించండి అంటూ మాట్లాడింది. అలాగే, ఈ ఫీల్డ్ లో నేను ఇలా ఉన్నాను అంటే అది నాభర్త సహకారమే అని చెప్పింది.
Most Recommended Video
‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?