Rk Roja: ఘనంగా దీపావళి జరుపుకున్న రోజా.. మహిళ విజయం అంటూ ట్వీట్?

  • October 25, 2022 / 07:26 PM IST

హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి ఏడాది ఎన్నో పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటాము. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది దీపావళి పండుగను కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇకపోతే ఈ ఏడాది కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా ఈ పండుగని జరుపుకున్నారు. ఈ క్రమంలోనే దివాళి సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలను సెలబ్రిటీల నుంచి మొదలుకొని సాధారణ ప్రజల వరకు సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే సినీనటి,ఏపీ మంత్రి రోజా సైతం తన ఇంటిలో దీపావళి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.దీపావళి పండుగను పురస్కరించుకొని రోజా ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజలు నిర్వహించడమే కాకుండా పెద్ద ఎత్తున దీపాలను వెలిగించి టపాసులు కాలుస్తూ ఉన్న ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ విధంగా రోజా సాంప్రదాయపద్ధంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..

దీపావళి పండుగ అంటే మహిళా విజయం… చీకట్లను చెరిపి వేసే ఈ పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు తేవాలని కోరుకుంటున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా అందరికీ దివాలి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఈమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రోజా సినీ కెరియర్ విషయానికి వస్తే ఎన్నో తెలుగు తమిళ భాషలలో అద్భుతమైన సినిమాలలో నటించిన రోజా తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెర కార్యక్రమాలలో కూడా ప్రారంభించారు.

ఇలా బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ రోజా ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు.అయితే తనకు మంత్రి పదవి రావడంతో బుల్లితెర కార్యక్రమాలకు కూడా ఈమె దూరంగా ఉండి ప్రస్తుతం రాజకీయాలలో కొనసాగుతున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus