ఆ ప్లాప్ సినిమా వల్ల రోజాకు ప్రేమ దొరికిందన్న మాట..!

  • May 29, 2020 / 04:33 PM IST

తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రోజా. ‘సర్పయాగం’ ‘ప్రేమ తపస్సు’ అనే చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినప్పటికీ ‘సీతారత్నం గారి అబ్బాయి’ అనే చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది రోజా. ఈమె అసలు పేరు శ్రీ లతా రెడ్డి అయినప్పటికీ ఈమె ఇండస్ట్రీకి వచ్చాక ఈమె పేరు రోజాగా మార్చుకుంది. అతి తక్కువ టైంలోనే నాగార్జున,బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ దక్కించుకుంది.

నటన పరంగా కూడా ఈమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళంలో కూడా రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో నటించిన రోజా..! ఇప్పుడు రాజకీయ నాయకురాలుగా అలాగే బుల్లితెర పై కూడా ఆకట్టుకుంటున్న రోజా.. తమిళ దర్శకుడు సెల్వమణి ని పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇతన్ని పెళ్ళి చేసుకోవడానికి ముందే రోజాకి తీవ్ర నష్టాల్ని మిగిల్చాడట సెల్వమణి. వివరాల్లోకి వెళితే.. 1994లో ‘సమరం’ అనే యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రాన్ని నిర్మించింది రోజా.

అందులో సుమన్ హీరోగా నటించాడు. ఈ చిత్రానికి సెల్వమణి డైరెక్ట్ చేసాడు. ఇళయరాజా సంగీత దర్శకుడు. అయితే ఈ చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో నిర్మాత రోజాకు చాలా నష్టాలు వచ్చాయి. ఇలా తన భర్త తీసిన సినిమా వల్ల రోజాకు చాలా నష్టాలు వాటిల్లాయట. కానీ ఈ ప్లాప్ సినిమా వల్ల వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమ, పెళ్ళి వరకూ వెళ్ళిందట.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus