ఆ హీరోకు జోడీగా రోజా కూతురు నటించనున్నారా?

  • September 20, 2022 / 01:34 AM IST

సీనియర్ నటి, వైసీపీ మంత్రి రోజా అటు సినిమాల ద్వారా, ఇటు రాజకీయాల ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా 2024 ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే కావడం ఖాయమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే రోజా కూతురు అన్షుమాలిక సినీ ఎంట్రీ గురించి ఈ మధ్య కాలంలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అన్షుమాలిక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించాలని రోజా అభిమానులు కోరుకుంటున్నారు.

టాలీవుడ్ హీరోయిన్ కు కావాల్సిన లక్షణాలన్నీ అన్షుమాలికలో ఉన్నాయని అన్షుమాలిక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే సక్సెస్ కావడం ఖాయమని అభిమానులు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమాతో అన్షుమాలిక సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. కోలీవుడ్ మీడియా వర్గాల్లో ఇందుకు సంబంధించి చర్చ జరుగుతోంది. రోజా లేదా అన్షుమాలిక ఈ వార్తల గురించి స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

అన్షుమాలిక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధిస్తే ఆమెకు ఆఫర్లు మరింత పెరుగుతాయని చెప్పవచ్చు. ధృవ్ సైతం సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలలో నటించినా ధృవ్ కోరుకున్న రేంజ్ హిట్ అయితే దక్కలేదనే చెప్పాలి. ధృవ్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు అన్షుమాలిక కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

యూఎస్ లోని ప్రముఖ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సును పూర్తి చేసి ఆ తర్వాత అన్షు మాలిక సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. అన్షుమాలిక సినిమాల్లోకి వచ్చి రోజాను మించిన నటిగా ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అన్షుమాలిక తన టాలెంట్ తో ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తల్లో నిలవడంతో పాటు తన వంతు సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus