Rowdy Boys Collections: ‘రౌడీ బాయ్స్’ ఓకె అనిపించారు కానీ..!

  • January 17, 2022 / 06:26 PM IST

‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో ‘హుషారు’ ఫేమ్ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. దిల్ రాజు సోదరుడు అయిన శిరీష్ కొడుకు ఆశీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ వంటివి యూత్ ను బాగానే ఆకట్టుకున్నాయి.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందించడం జరిగింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ‘రౌడీ బాయ్స్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది పర్వాలేదు అనే టాక్ ను కూడా సంపాధించుకుంది.

‘బంగార్రాజు’ కి పోటీగా వచ్చిన ఈ చిత్రం పర్వాలేదు అనే టాక్ ను సంపాదించుకుంది. కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. దాంతో కలెక్షన్లు సో సో గా నమోదయ్యాయి. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :

నైజాం  0.95 cr
సీడెడ్  0.44 cr
ఆంధ్రా(టోటల్)  1.05 cr
ఏపి+తెలంగాణ (టోటల్)  2.44 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.04 cr
ఓవర్సీస్  0.08 cr
వరల్డ్ వైడ్ టోటల్  2.56 cr

‘రౌడీ బాయ్స్’ చిత్రానికి రూ.9.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.10 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టాక్ యవరేజ్ గా ఉండడంతో 3 రోజులకి ఈ చిత్రం రూ.2.56 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. తొలి రోజు ‘రౌడీ బాయ్స్’ చిత్రానికి ‘బంగార్రాజు’ కంటే కూడా ఎక్కువ థియేటర్లు దక్కాయి.అయినప్పటికీ ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకోలేకపోయింది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus