‘ఆర్.ఆర్.ఆర్’ తో జక్కన్నకు పెద్ద తలనొప్పి..?

రాంచరణ్, ఎన్టీఆర్ లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. ఎట్టకేలకు ఈ చిత్రంలో హీరోయిన్స్ ను రాజ‌మౌళి ఫైనల్ చేసి అనౌన్స్ చేసాడు. అయితే ఎప్పుడూ లేని విధంగా రాజమౌళికి పెద్ద ట్విస్ట్ వచ్చి పడింది. ఇప్పటికే ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడీగా నటించాల్సిన హీరోయిన్ డైసీ.. కొన్ని కుటుంబ కారణాల వల్ల ‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ తప్పుకుంటున్నాని చెప్పి ఎస్కేప్ అయిన సంగతి తెలిసిందే. దీంతో మరో హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డాడు జక్కన్న.

ఇదిలా ఉండగా రాంచరణ్ కు గాయమవ్వడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు ఈ టీమ్ కు మరో సమస్య వచ్చి పడింది. అదేంటంటే… ఈ చిత్రంలో చరణ్ కు జోడీగా నటించాల్సిన బాలీవుడ్ నటి అలియా భట్ డేట్స్ అడ్జస్ట్మెంట్ చాలా కష్టంగా మారిందట. అలియా వరస పెట్టి పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ‘సడక్ 2’, ‘ఇన్షా అల్లా’, ‘హమ్ ఆపకే హై కౌన్’ సీక్వెల్, ‘బ్రహ్మాస్త్ర’ వంటి పెద్ద సినిమాలు చేస్తుంది. దీంతో అలియా తన డేట్స్ ను చాలా జాగ్రత్తగా ఎడ్జెస్ట్ చేసుకుంటూ వెళ్తోంది. ఎక్కడ ఎవరి షెడ్యూల్ అప్ సెట్ అయినా.. ఆమె చేసే మిగిలిన సినిమా యూనిట్లకు ఇబ్బంది తప్పదు. ఈ క్రమంలో రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ కు ఎక్కువ డేట్స్ కేటాయించే పరిస్దితి లేదు. దీంతో ఆమె ఉన్నప్పుడే హీరోల డేట్స్ ను ఎడ్జెస్ట్ చేసుకుంటూ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. జూన్ లో కొద్ది రోజులు, జూలై లో కొద్ది రోజులు ఆమె డేట్స్ ఇస్తానందని సమాచారం. మే లో ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్లో బిజిగా ఉంటుందట. ఈ క్రమంలో రాజమౌళికి పెద్దకష్టమే వచ్చింది. ఎప్పుడూ చిన్న హీరోయిన్లనో, ప్లాపుల్లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లనో సెలెక్ట్ చేసుకుని సెట్స్ కు వెళ్ళేవాడు జక్కన్న. దీంతో ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదు.. కానీ ఈసారి పెద్ద హీరోయిన్లను సెలెక్ట్ చేసుకోవడం వలనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus