అక్కడ భారీ రేటు పలికిన ‘ఆర్.ఆర్.ఆర్’ ..!

  • February 21, 2020 / 08:33 PM IST

రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్, చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. ఈ చిత్రం పేరేంటో ఇంకా అనౌన్స్ చెయ్యలేదు కానీ.. రిలీజ్ డేట్ మాత్రం 2021 జనవరి 8న అంటూ అనౌన్స్ చేసేసారు. ఇక ఈ చిత్రానికి సంబందించిన థియేట్రికల్ బిజినెస్ అప్పుడే మొదలైపోయింది. ‘బాహుబలి2’ మించి అన్ని ఏరియాల్లో రికార్డు బిజినెస్ ను నమోదు చేస్తుంది ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం.

ఇక చరణ్, ఎన్టీఆర్ లకు భారీ క్రేజ్ ఉన్న సీడెడ్ ఏరియాలో అయితే ఈ చిత్రం ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం అక్కడ 50 కోట్ల బిజినెస్ చేసిందట. ఇప్పటి వరకూ ఏ చిత్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్ చెయ్యలేదు. రాజమౌళి దర్శకుడు కావడంతో ఇంకా భారీ రేటు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఎలాగూ లాభాలు రావడం ఖాయం అని వారు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఏదైతేనేంటి రిలీజ్ కి ఇంకా 9 నెలలు పైనే సమయం ఉన్నప్పటికీ ఈ చిత్రం అద్భుతాలు సృష్టిస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus