RRR Movie: ఆర్ఆర్ఆర్ ఫైట్ సీన్ వెనుక ఇంత కథ ఉందా?

  • July 15, 2022 / 11:43 AM IST

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో చరణ్, ఎన్టీఆర్ కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ ఈ ఇద్దరి ఖాతాలో చేరడంతో పాటు ఈ ఇద్దరు హీరోల మార్కెట్ అమాంతం పెరిగింది. ఆర్ఆర్ఆర్ మూవీలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సన్నివేశాలలో ఇంటర్వెల్ సీన్ ఒకటనే సంగతి తెలిసిందే. ఇంటర్వెల్ సీన్ లో అప్పటివరకు స్నేహితులుగా ఉన్న రామ్, భీమ్ ఒకరితో ఒకరు తలపడతారు.

అయితే ఈ సన్నివేశానికి 53 సంవత్సరాల క్రితం విడుదలైన మంచి మిత్రులు అనే సినిమా స్పూర్తి అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మంచి మిత్రులు సినిమాలో కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా నటించారు. 1969 సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో శోభన్ బాబు పోలీస్ పాత్రలో నటించగా కృష్ణ దొంగ పాత్రలో కనిపించి మెప్పించారు. మొదట కృష్ణ, శోభన్ బాబు మిత్రులుగా ఉండగా ఒక సన్నివేశంలో ఒకరి గురించి మరొకరికి నిజం తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ సీన్ గురించి వైరల్ అవుతున్న కామెంట్ల గురించి విజయేంద్ర ప్రసాద్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ ఫుల్ రన్ లో 1140 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించడం గమనార్హం. మే నెలలో ఈ సినిమా విడుదలై ఉంటే మరింత ఎక్కువ మొత్తం కలెక్షన్లు సాధించేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్, జీ5 ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఆర్ఆర్ఆర్ మూవీ శాటిలైట్ హక్కులను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన స్టార్ మా ఛానల్ కొనుగోలు చేసింది. ఆర్ఆర్ఆర్ మూవీ బుల్లితెరపై ప్రసారమైతే మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే బుల్లితెరపై ఈ సినిమా ఎప్పుడు ప్రసారమవుతుందో తెలియాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో జక్కన్న రేంజ్ మరింత పెరిగిందని తెలుస్తోంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus