Jr NTR: ఎన్టీఆర్‌ గాయంపై రియాక్ట్‌ అయిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌

  • August 8, 2021 / 01:59 PM IST

పిట్ట గోడపై మిత్రుల ముచ్చట అంటూ శనివారం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఓ చిన్న వీడియోను విడుదల చేసింది. ఓ గోడ మీద రామ్‌చరణ్‌, తారక్‌ ఏదో మాట్లాడుకుంటుంటే… వారిని జక్కన్న రాజమౌళి షూట్‌ చేస్తున్నట్లుగా ఆ వీడియో ఉంది. అయితే కీన్‌గా అబ్జర్వ్‌ చేస్తే ఎన్టీఆర్ నుదిటిపై చిన్నపాటి గాయం కనిపిస్తుంది. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఎన్టీఆర్‌ మరోసారి షూటింగ్‌లో గాయపడ్డాడా అని ట్విటర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ని అడగడం మొదలెట్టారు.

తారక్ అభిమానుల ఆందోళనను గమనించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఆ వీడియోకి కింది ఓ కామెంట్‌కు రిప్లై ఇచ్చింది. అందులో ఎన్టీఆర్‌ ఎలాంటి గాయం తగల్లేదని, అది షూటింగ్‌ కోసం వేసిన మేకప్‌ అని చెప్పింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇక్కడో డౌట్‌ కూడా ఉంది. ఎన్టీఆర్‌, చరణ్‌ డ్రెస్‌లు చూస్తుంటే షూటింగ్‌ జరుగుతున్నట్లు లేదు. మేకప్‌ కూడా కనిపించడం లేదు. మరి గాయం మేకప్‌ మాత్రం అలానే ఎందుకుంచారో.

సినిమా నేపథ్యం అందరికీ తెలిసిందే. తారక్‌ ఇందులో గోండు బొబ్బులి కొమురం భీమ్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ పాత్ర జీన్స్‌, టీ షర్ట్‌ వేసుకోదు. కాబట్టి షూటింగ్‌ స్పాట్‌లో వీడియో ఇది కాదు. మరి ఆ గాయం మేకప్‌ మాత్రమే ఎందుకు అలా కొనసాగించినట్లో అనేది అర్థం కావడం లేదు. చూద్దాం… ఎన్టీఆర్‌ ఎలాగూ కొద్ది రోజుల్లో తిరిగి హైదరాబాద్‌ వచ్చేస్తాడు. అప్పుడు ఎయిర్‌పోర్ట్‌ ఫొటోలు బయటకు వస్తాయి. అప్పుడు క్లారిటీ వచ్చేస్తుందిలే.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus