Pawan Kalyan: పవన్ సుజీత్ మూవీ అసలు టైటిల్ ఇదేనా.. సూపర్ అంటూ?

Advertisement

పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా అసలు టైటిల్ ఇది కాదని ఈ సినిమాకు హంగ్రీ చీతా అనే టైటిల్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. హంగ్రీ చీతా టైటిల్ బాగుందని అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ టైటిల్ ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సుజీత్ ఈ సినిమాను వేరే లెవెల్ లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

పవన్ కు సుజీత్ ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వడం ఖాయమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ సుజీత్ కాంబో మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పవన్ ఈ సినిమాకు 65 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

పవన్ సుజీత్ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను ప్లాన్ చేశారని తెలుస్తోంది. హంగ్రీ చీతా టైటిల్ గురించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఏపీలో ఎన్నికలు పూర్తైన తర్వాత పవన్ తన సినిమాల షూటింగ్ లతో బిజీ కానున్నారని భోగట్టా. పవన్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. పవన్ ఈ ఏడాది కనీసం రెండు సినిమాలను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

పవన్ (Pawan Kalyan) గత సినిమా బ్రో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా మరీ భారీ రేంజ్ లో కలెక్షన్లు అయితే సాధించలేదనే సంగతి తెలిసిందే. పవన్ పొలిటికల్ గా, సినిమాలలో సక్సెస్ సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా పవన్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus