పదికోట్లను కొల్లగొట్టిన ఆర్ఎక్స్100!

“కొడితే బాక్సులు బద్దలయి పోద్ది” అని మెగాస్టార్ ఓ సినిమాలో చెప్పినట్లు యువ దర్శకుడు అజయ్ భూపతి బాక్స్ ఆఫిస్ బద్దలయ్యేలా కొట్టారు. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ లతో “ఆర్‌ఎక్స్ 100” మూవీ తెరకెక్కించి సంచలన విజయం సాధించారు. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12 న రిలీజ్ అయి భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని తొలిరోజే 1.42 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం నాలుగురోజుల్లోనే 10 కోట్ల గ్రాస్ సాధించి ఔరానిపించింది. మౌత్ టాక్ కారణంగా ఈ సినిమాని చూసేందుకు యువత ఎగబడుతున్నారు. దీంతో పదకొండురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల షేర్ రాబట్టి అదరగొట్టింది. ఏరియాల వారీగా కలక్షన్స్ వివరాలు.

ఏరియా : కలక్షన్స్
నైజాం : 4.54 కోట్లు
సీడెడ్ : 1.14 కోట్లు
ఉత్తరాంధ్ర : 1.03 కోట్లు
గుంటూరు : 0.59 కోట్లు
కృష్ణ : 0.60 కోట్లు
ఈస్ట్ గోదావరి : 0.72 కోట్లు
వెస్ట్ గోదావరి : 0.57 కోట్లు
నెల్లూరు : 0.23 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో : 9.42 కోట్లు
ఇతర ప్రాంతాల్లో : 0.38 కోట్లు
ఓవర్సీస్ : 0.35 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా : 10.15 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus