హిందీలో సూపర్ హిట్ అయిన సీరియల్ ‘సాథ్ నిబానా సాథియా’.. తెలుగులో ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ పేరుతో డబ్ చేయగా.. ఇక్కడ కూడా మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది.. ఈ ధారావాహికలో గోపిక పాత్రలో నటించిన దెవోలీనా భట్టాఛార్జీ తెలుగు నాట కూడా గుర్తింపు తెచ్చుకుంది.. డిసెంబర్ 14న దెవోలీనా పెళ్లి చేసుకుంది.. ఆమె హల్దీ, మెహందీ, సంగీత్ లాంటి ఫంక్షన్స్ అలాగే వెడ్డింగ్ కూడా చాలా ఘనంగా జరిగాయి..
తన ప్రీ వెడ్డింగ్ ఫెస్టివ్ మూమెంట్స్ అండ్ వెడ్డింగ్ మూమెంట్స్ అన్నిటినీ షేర్ చేసుకుందామె.. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది.. అదే సీరియల్‌లో నటించిన విశాల్ సింగ్‌తో తను ప్రేమలో ఉందని.. వాళ్లిద్దరే పెళ్లి చేసుకుంటున్నారు అని అనుకున్నారు.. ఎందుకంటే మరి వాళ్లు అప్ లోడ్ చేసిన పిక్స్ అలానే ఉన్నాయి.. కట్ చేస్తే, పెళ్లి ఫోటో విషయంలో కూడా క్లారిటీ ఇవ్వకుండా.. ఆ మిస్టరీ పెళ్లి కొడుకు ఎవరబ్బా? అనే కన్ఫ్యూజన్‌లో పడేసింది.. ప్రస్తుతం దెవోలీనా వెడ్డింగ్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!