Sailesh Kolanu: ‘హిట్ 3’ కాదు… శైలేష్ కొలను నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే..!

  • January 20, 2024 / 07:11 PM IST

ఈ సంక్రాంతికి 4 సినిమాలు వచ్చాయి. అందులో ‘సైంధవ్’ కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ నటించిన 75 వ సినిమా ఇది. అలాగే ‘హిట్’ ‘హిట్ 2 ‘ చిత్రాలతో ఫామ్లో ఉన్న దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన హ్యాట్రిక్ మూవీ కూడా. జనవరి 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కి ముందు మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్న మూవీ ఇది.కానీ తొలి రోజు మిక్స్డ్ తెచ్చుకుంది. కొంతమంది ‘బాగుంది’ అన్నారు..

ఇంకొంతమంది ‘యావరేజ్’ అన్నారు, ఇంకొంతమంది అయితే ‘ఇది పండక్కి రావాల్సిన సినిమా కాదు’ అన్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ గట్టెక్కలేకపోతుంది. ఒకవేళ వేరే టైంలో రిలీజ్ అయ్యి ఉంటే కనుక కచ్చితంగా ‘సైంధవ్’ రిజల్ట్ మరోలా ఉండేది అనడంలో అతిశయోక్తి లేదు.ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో ఇవే కామెంట్స్ వినిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. దర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu) నెక్స్ట్ మూవీ ఏంటి? అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ‘హిట్ 3 ‘ కి కచ్చితంగా టైం పడుతుంది.హీరో నాని కూడా వేరే సినిమాలకి కమిట్ అయ్యాడు. ఈ గ్యాప్లో మరో సినిమా చేయాలని దర్శకుడు శైలేష్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

‘గుంటూరు కారం’ నిర్మాతల్లో ఒకరైన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగ వంశీ నిర్మాణంలో శైలేష్ ఓ సినిమా చేయబోతున్నాడు. హీరో ఇంకా ఫిక్స్ అవ్వలేదు.ప్రస్తుతానికి కథా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని శైలేష్ భావిస్తున్నాడు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus