Salaar: సలార్ ఫైట్ లీకైందా.. మేకర్స్ చెప్పిన విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

  • October 11, 2023 / 10:57 AM IST

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా మరో రెండు నెలల్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. డిసెంబర్ నెల 22వ తేదీన ఈ సినిమా విడుదల కానుండటం గమనార్హం. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ వచ్చినా ఆ అప్ డేట్ తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. తాజాగా ప్రభాస్ ఫ్యాన్ ఒకరు సోషల్ మీడియాలో సలార్ ఫైట్ సీన్ లీకైందని ఎవరికైనా ఆ సీన్ కావాలంటే డైరెక్ట్ గా మెసేజ్ చేయాలని కోరాడు.

చివర్లో నూటికి నూరు శాతం నిజం అంటూ సదరు అభిమాని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ మేకర్స్ దృష్టికి రావడంతో సలార్ మేకర్స్ లీకైన ఫైట్ సీన్ ను తమకు కూడా డైరెక్ట్ మెసేజ్ చేయండి అంటూ సమాధానం ఇచ్చారు. సలార్ నుంచి ఎలాంటి ఫైట్ సీన్ లీక్ కాలేదని సలార్ మేకర్స్ చెప్పేశారు. మరోవైపు సలార్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

సలార్ (Salaar) మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా సలార్2 సినిమాకు సంబంధించి షూట్ పూర్తైందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. సలార్2 సినిమా 2025లో లేదా 2026లో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబో సీన్లు వేరే లెవెల్ లో ఉన్నాయని సమాచారం అందుతోంది. శృతి హాసన్ కు కూడా ఈ సినిమాలో పవర్ ఫుల్ రోల్ దక్కిందని భోగట్టా.

సలార్, సలార్2 సినిమాలు భారీ స్థాయిలో తెరకెక్కడంతో పాటు భారీ రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రభాస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నష్టాలను మిగిల్చిన నేపథ్యంలో ప్రభాస్ తర్వాత సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తాయేమో చూడాల్సి ఉంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus