Salaar: సలార్ కు పోటీగా ప్రకటిస్తే అంగీకరిస్తారా.. ఆ మేకర్స్ ప్రశ్న ఇదే!

  • September 27, 2023 / 04:04 PM IST

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ డిసెంబర్ 22వ తేదీన థియేటర్లలో విడుదల కానుండగా మేకర్స్ ఈ విషయాన్ని ఈ నెల 29వ తేదీన ప్రకటించే ఛాన్స్ ఉంది. సలార్ సినిమా ఇప్పటికే రిలీజ్ డేట్ ను మార్చడం వల్ల చాలా సినిమాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు సలార్ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయడం వల్ల ఆ సమయంలో రిలీజ్ కావాల్సిన సినిమాలకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.

సలార్ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిన తర్వాత ఆ సినిమాకు పోటీగా మరిన్ని సినిమాలను ప్రకటిస్తే సలార్ కు పోటీగా ప్రకటిస్తే అంగీకరిస్తారా అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ మేకర్స్ రిలీజ్ డేట్లను ఇష్టానుసారం మారుస్తూ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమా ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషంగా లేరు.

సలార్ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేయగా ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించగా ఆమె పాత్రకు సంబంధించి సరైన అప్ డేట్స్ రావడం లేదు. రిలీజ్ కు ముందే ఈ సినిమా బడ్జెట్ కు రెట్టింపు స్థాయిలో లాభాలను అందించింది. సలార్ సినిమా సీక్వెల్ కూడా భారీ రేంజ్ లో తెరకెక్కుతోంది.

సలార్ (Salaar) మేకర్స్ భవిష్యత్తు ప్రాజెక్ట్ ల విషయంలో అయినా ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంది. సలార్ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించడంతో పాటు రికార్డులు తిరగరాస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ సలార్ సినిమా గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సలార్ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus