Salaar: ‘సలార్‌’లో మార్పులు అంటే కాదన్నారు… మరి ఈ మార్పు ఏంటో?

  • October 6, 2023 / 03:41 PM IST

‘సలార్‌’ సినిమాను సెప్టెంబరు ఆఖరు నుండి డిసెంబరు ఆఖరుకు వాయిదా వేశారు. కారణమేంటి అని చూస్తే.. ఏవేఓ క్వాలిటీ, బెస్ట్‌ అవుట్‌పుట్‌ అంటూ చెప్పుకొచ్చారు. నిజానికి అదేనా కారణం, ఇంకా ఏమైనా ఉన్నాయా అనే డౌట్లు సినిమా జనాలకు ఉన్నాయి. వాటిల్లో ఒకటి రీషూట్లు. ఈ సినిమా కోసం కొన్ని సన్నివేశాలను మళ్లీ తెరకెక్కిస్తున్నారని, దాని కోసం సెట్లు బూజు దులిపారు అని కూడా పుకార్లు వచ్చాయి. వీటిని సినిమా సన్నిహిత వర్గాలు కొట్టిపడేశాయి.

కానీ ఇటీవల అప్‌డేట్‌ చేసిన సినిమా టీజర్‌ చూస్తే.. కచ్చితంగా రిపేర్లు జరిగాయి అని తెలిసిపోతుంది. కావాలంటే ఓసారి సినిమా టీజర్‌ను మళ్లీ చూడండి. అందులో ఓ సన్నివేశంలో మార్పు చేశారు. ఏంటీ యూట్యూబ్‌లో రిలీజ్‌ చేసిన వీడియోను మళ్లీ అప్‌డేట్‌ చేయొచ్చా అంటారా? అందరికీ ఈ విషయంలో అవకాశం లేదు కానీ.. పెద్ద పెద్ద ఛానల్స్‌కి ఉన్నాయి అంటారు. అలా హోంబలే ఫిల్మ్స్‌ టీజర్‌ను అప్‌డేట్ చేసింది. అందులో కలర్ కరెక్షన్ చేసి కొంత చేయడంతో పాటు.. ఓ సన్నివేశాన్ని మార్చారు కూడా.

వీడియో ఏదో చీకట్లో ఉన్నట్లుగా ఉంది అనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో బ్రైట్‌నెస్‌ పెంచి ఉండొచ్చు. అయితే ఒక మనిషి గుర్రంపై నుండి ఏదో సంకేతం ఇచ్చే షాట్ తీసేసి దాని స్థానంలో మాస్కులు వేసుకున్న సైనికులు ఓ పెద్ద భవనంలో కవాతు చేసుకుంటూ నడిచే సన్నివేశం పెట్టారు. ఇక వీటితోపాటు (Salaar) సినిమా రిలీజ్‌ డేట్‌ అంటే డిసెంబర్ 22ను టీజర్‌ ఆఖరులో యాడ్‌ చేశారు. దీంతో అసలు ఈ మార్పులు ఎందుకు చేశారు అనే ప్రశ్న మొదలైంది.

ఏదో విషయం చెబుతున్నట్లుగా ఉన్న ఆ షాట్‌ను తీసేయడం వెనుక కారణం ఏంటి అనేది చూడాలి. అలాగే ఈ కొత్త సీన్ ఇటీవల షూట్‌ చేశారు అనే పుకారు నిజమో కాదో చెప్పాలి. నిజానికి ‘కేజీయఫ్‌’ సినిమాల విషయంలోనూ ఇలానే జరిగింది. పర్‌ఫెక్షన్‌ కోసమే ఇలా చేశారు అని అంటుంటారు. ఇక ఆఖరుగా అక్టోబరు 23న ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ పక్కాగా ఉంటుంది అంటున్నారు. అయితే అదేంటో ఇంకా తేలలేదట.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus