Salaar: సంక్రాంతికి సలార్ విడుదలైతే ఆ సినిమాలకు చుక్కలేనా?

  • September 3, 2023 / 01:44 PM IST

ఈ నెల సెప్టెంబర్ 28వ తేదీన సలార్ మూవీ విడుదలవుతుందని భావించిన ఫ్యాన్స్ ఆశలు అడియాశలయ్యాయి. యూఎస్ లో ఈ సినిమా బుకింగ్స్ ఆపేయడంతో సలార్ రిలీజ్ డేట్ మారనుందని క్లారిటీ వచ్చేసింది. 2023 సంవత్సరం సంక్రాంతి కానుకగా సలార్ రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సలార్ సంక్రాంతికి రిలీజైతే మాత్రం మామూలుగా ఉండదని చెప్పవచ్చు. సంక్రాంతికి ఇప్పటికే ఐదు సినిమాలు ఫిక్స్ కావడంతో సలార్ సంక్రాంతికి ఫిక్స్ అయితే కనీసం 3 సినిమాలు తప్పుకోవాల్సి ఉంటుంది.

అదే సమయంలో ఇతర సినిమాలతో పోల్చి చూస్తే సలార్ సినిమాకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కే అవకాశం ఉంది. సలార్ మూవీ వాయిదా పడటంతో ఇతర దర్శకనిర్మాతలు తెగ టెన్షన్ పడుతున్నారు. సంక్రాంతికి సలార్ విడుదలైతే మాత్రం తమకు కష్టమేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సలార్ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు రికార్డులను తిరగరాయడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సలార్ (Salaar) మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను, యాక్షన్ సినిమాలను ఇష్టపడే అభిమానులను మెప్పించే అవకాశాలు అయితే ఉన్నాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు ఎక్కడ తప్పటడుగు వేశారో క్లారిటీ రావాల్సి ఉంది. సలార్1 రిలీజ్ ఆలస్యం అవుతుండటంతో సలార్2 విషయంలో కూడా అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. సలార్2 మూవీ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

సలార్, సలార్2 సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమాలు రిలీజ్ కు ముందు, రిలీజ్ తర్వాత బాహుబలి2 సినిమాను మించిన కలెక్షన్లను సాధించి అభిమానులను ఆకట్టుకుంటాయేమో చూడాల్సి ఉంది. సలార్ మూవీ ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మరికొన్ని నెలలు ఎదురుచూడక తప్పదు. ప్రభాస్ సినిమాలకే ఎందుకిలా జరుగుతోందని కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus